డిసెంబర్‌ 2న తిరుట్టుపయలే–2

31 Oct, 2017 05:23 IST|Sakshi

తమిళసినిమా: బాబిసింహా, ప్రసన్నా, అమలాపాల్‌ నటించిన చిత్రం తిరుట్టుపయలే–2. తిరుట్టుపయలే మొదటి భాగాన్ని  నిర్మించిన ఏజీఎస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ సంస్థ కల్పాత్తి అగోరమే తిరుట్టుపయలే–2కు కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. జీవన్, అబ్బాస్, సోనియా అగర్వాల్‌ కలిసి నటించిన తిరుట్టుపయలే చిత్రం తొలి భాగం 2006 ఏప్రిల్‌లో విడుదలైంది.

సాధారణంగా ఒక చిత్రం మొదటి భాగం విడుదలైన ఒకటి రెండు సంవత్సరాల్లోనే రెండో భాగం కూడా విడుదల చేస్తారు. అయితే తిరుట్టుపయలే చిత్రం 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండో భాగం విడుదలకు సిద్ధమవుతుండడం విశేషం. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 2న విడుదల చేయాలని నిర్ణయించినట్టు చిత్ర యూనిట్‌ తెలిపింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు