వివాదంరేపిన పోస్టర్ ఇదే!

19 Dec, 2013 19:02 IST|Sakshi

హైదరాబాద్: మహేష్ బాబు తాజా చిత్రం ‘1-నేనొక్కడినే' పోస్టర్ విడుదల చేశారు. అది పెద్ద వివాదం రేపింది. ఇక సినిమా ఎంత సంచలనం సృష్టిస్తోందోనని సినీవర్గాల చర్చ.    పైన పోస్టర్లో హీరో మహేష్ బాబు బీచ్‌లో నడుస్తుంటే హీరోయిన్ కృతి సనన్ అతని కాలి అడుగులను మోకాళ్లు, చేతులతో పాకుతూ అనుసరిస్తూ ఉంది. ఈ పోస్టర్ను దృష్టిలోపెట్టుకొనే  హీరోయిన్ సమంత సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చేసిన వ్యాఖ్యలపై ట్విట్ల యుద్ధం జరుగుతోంది. సమంతకు సంఘీభావంగా హీరో సిద్ధార్ధ కూడా ట్వీట్ చేశారు. ఈ పోస్టర్పై  సమంత పరోక్షంగా విమర్శలు చేయడంపట్ల ప్రిన్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాస్తవానికి సమంత హీరో పేరుగానీ, సినిమా పేరుగాని తన ట్విట్లో ప్రస్తావించలేదు. 'విడుదలకు సిద్ధమవుతున్న ఓ సినిమా పోస్టర్‌ను  ఈ మధ్య నేను చూశాను. ఆ పోస్టర్‌లో హీరో, హీరోయిన్ని చూస్తుంటే మహిళల గౌరవాన్ని దిగజార్చేలా ఉంది' అంటూ ట్వీట్ చేసింది. ఈ కామెంట్ '1-నేనొక్కడినే' సినిమా పోస్టర్పైనేనని ప్రిన్స్ అభిమానుల అభిప్రాయం. ఇక అభిమానుల యుద్దం ఎలా ఉంటుందో అదరికీ తెలిసిందే. వారి స్టైల్లో కొందరు నిరసన తెలుపుతుంటే, మరి కొందరు ప్రతీకారం తీర్చుకున్నట్లుగా యుద్ధం చేస్తున్నారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కొందరు మహేష్ బాబుకు మద్దతు పలుకుతుంటే,  మరికొందరు సమంతను సమర్ధిస్తున్నారు.

సినిమాల విషయంలో ఇవన్నీ పట్టించుకోవలసిన అవసరంలేదని కొందరంటుంటే, కొంత మందికి మాత్రం ఈ పోస్టర్ అగ్రహాన్ని తెప్పించిన మాట వాస్తవం.  ఈ పోస్టర్ ఆడవాళ్లను కించపరిచే విధంగా వుందని  విమర్శిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి