స్టైలంటే ఇదే..రాజమౌళి

1 May, 2016 14:22 IST|Sakshi
స్టైలంటే ఇదే..రాజమౌళి

హైదరాబాద్:

బాహుబలి చిత్రంతో ప్రపంచాన్నే తన వైపు తిప్పుకున్న దర్శకుడు రాజమౌళి 'కబాలీ' టీజర్ ను చూసి ఫిదా అయిపోయాడు. సూపర్ స్టార్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. రజనీ తాజా చిత్రం కబాలీకి సంబంధించిన అధికారిక టీజర్ విడుదలైన నేపథ్యంలో దానిపై రాజమౌళి స్పందించాడు. 'స్టైలంటే ఇది.. రజనీ అంటే ఇది.. తలైవా అంటే ఇది..' అంటూ ట్వీట్ చేశారు. కబాలీ టీజర్ వీడియో లింక్ ను కూడా ట్వీట్ చేశారు.

మరో వైపు బాహుబలి చిత్రాన్ని ఇటీవల విడుదలవుతున్న చాలా చిత్రాలతో పోల్చుకుంటూ ట్వీట్లు చేస్తున్న రామ్ గోపాల్ వర్మ ఈ టీజర్ ను చూసి పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. 'ఒక్క రజనీ కాంత్ సర్ తప్ప ఏ ఒక్క సూపర్ స్టార్ కూడా వెండితెరను ఈ విధంగా వైబ్రేటే చేయలేరు. విడుదలైన రోజే నేను కబాలీ చిత్రాన్ని వరుసగా నాలుగుసార్లు చూస్తాను. కబాలీ బాహుబలికా బాప్ లాగా కనిపిస్తోంది. ఒక్క రజనీకాంత్ మాత్రమే ఇలా చేయగలరు' అని పేర్కొన్నారు.