తొలిప్రేమ షాకింగ్‌ కలెక్షన్లు

15 Feb, 2018 09:00 IST|Sakshi

సాక్షి, సినిమా : మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్, రాశీఖన్నా నటించిన ‘తొలిప్రేమ’  చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపిస్తోంది. ప్రేమకథా చిత్రం కావడంతో అన్నీ వర్గాల ప్రేక్షకుల మనసులను దోచింది. ముఖ్యంగా ఈ యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరికి యువతలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి పాజిటివ్‌ టాక్‌తో విజయవంతంగా నడుస్తోంది.

నిర్మాణ సంస్థ లెక్కల ప్రకారం మొదటి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.25.8 కోట్ల గ్రాస్, రూ.14.6 కోట్ల షేర్ ను రాట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 10.77 కోట్ల షేర్ ను వసూలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు లాభాల దిశగా అడుగులు వేస్తున్నారట. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మంచారు. వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయం అయ్యారు.

మరిన్ని వార్తలు