మూడు గెటప్‌లలో విలన్‌

9 Apr, 2018 06:29 IST|Sakshi
తమిళ నటుడు బాబీ సింహా

తమిళ సినిమా : తమిళం, మలయాళం భాషల్లో విలక్షణ నటుడిగా రాణిస్తున్న తెలుగు నటుడు బాబీసింహా. స్వయంకృషితోనే ఎదుగుతున్న నటుడీయన. చిన్న పాత్రల నుంచే విలన్, హీరో స్థాయికి చేరుకున్నారు. జిగర్‌తండా చిత్రంలో విలక్షణ విలనీయంను ప్రదర్శించి జాతీయ అవార్డును గెలుచుకున్న నటుడు బాబీసింహా. ఆ తరువాత హీరోగా అవతారమెత్తారు. ఉరుమీన్‌ లాంటి కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించినా ఆయన్ని హీరోగా కంటే విలన్‌గానే ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్న విషయాన్ని గ్రహించి, వారి అభీష్టానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. అంతే మళ్లీ నటుడిగా బిజీ అవుతున్నారు.

ప్రస్తుతం విక్రమ్‌ హీరోగా నటిస్తున్న సామి స్క్వేర్‌ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. ఇది గతంలో విక్రమ్‌ నటించిన సామి చిత్రానికి కొనసాగింపు అన్నది తెలిసిందే. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీసురేశ్‌ నాయకి. పులి, ఇరుముగన్‌ చిత్రాల నిర్మాత శిబుతమీన్‌ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో బాబీసింహా మూడు గెటప్‌లలో కనిపించనున్నారట. దర్శకుడు హరి చిత్రంలో విలన్‌ పాత్రలు చాలా శక్తివంతంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. 

సామి చిత్రంలో కోటాశ్రీనివాసరావు విలన్‌గా నటించారు. ఆ చిత్రంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అదే విధంగా సామి స్క్వేర్‌ చిత్రంలో బాబీసింహా పాత్ర చాలా బలమైందిగా ఉంటుందట. ఈయన నటిస్తే బాగుంటుదనే దర్శక నిర్మాతలతో పాటు నటుడు విక్రమ్‌ కూడా బాబీసింహాను సంప్రదించారు. సామి స్క్వేర్‌ చిత్రం తరువాత బాబీసింహా మరోసారి విలన్‌గా బిజీ అయిపోతారంటున్నారు ఆ చిత్ర వర్గాలు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా