ప్రేక్షకులకు థ్రిల్‌

26 May, 2018 06:00 IST|Sakshi

‘బిచ్చగాడు, 16’ చిత్రాలతో మంచి అభిరుచి గల నిర్మాతలుగా చదలవాడ బ్రదర్స్‌ టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చదలవాడ బ్యానర్‌లో సినిమా అంటే సమ్‌థింగ్‌ స్పెషల్‌. తాజాగా ఈ బ్యానర్‌లో రాబోతోన్న చిత్రం ‘టిక్‌ టిక్‌ టిక్‌’. జయం రవి, నివేదా పేతురాజ్‌ జంటగా శక్తి సౌందర్‌ రాజన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. చదలవాడ బ్రదర్స్‌ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్‌ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి, చదలవాడ లక్ష్మణ్‌ ‘టిక్‌ టిక్‌ టిక్‌’ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

జూన్‌ 22న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. లక్ష్మణ్‌ మాట్లాడుతూ– ‘‘అంతరిక్ష నేపథ్యంలో రూపొందిన తొలి భారతీయ చిత్రమిది. ప్రతి ప్రేక్షకుడు థ్రిల్‌ అయ్యేలా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ మిలియన్‌ వ్యూస్‌ను రీచ్‌ అయింది. ‘బిచ్చగాడు, 16’ సినిమాలను మించేలా తెరకెక్కిన విలక్షణమైన సబ్జెక్ట్‌ ఇది. మా బ్యానర్‌లో విడుదల చేస్తుండటం గర్వంగా ఉంది’’ అన్నారు. 

మరిన్ని వార్తలు