కాలమే శత్రువు

16 Jun, 2018 01:17 IST|Sakshi
జయం రవి

గెలవాలని ఓ టీమ్‌ అంతరిక్షంలోకి బయలుదేరింది. ఓడిపోతే దాదాపు 4 కోట్ల మంది ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుంది. ఆ టీమ్‌ ప్రధాన శత్రువు టైమ్‌ అంట. మరి.. గెలవడానికీ ఈ టీమ్‌ లీడర్‌ ఏం చేశాడు? అంతరిక్షంలో వాళ్లు ఎలాంటి అవరోధాలను అధిగమించాల్సి వచ్చింది? ఇటువంటి ఆసక్తికర అంశాలతో రూపొందిన తమిళ చిత్రం ‘టిక్‌. టిక్‌. టిక్‌’. శక్తి సుందర్‌ రాజన్‌ దర్శకత్వంలో ‘జయం’ రవి హీరోగా నటించారు. నివేథా పేతురాజ్, రమేశ్‌ తిలక్, అరోణ్‌ అజీజ్‌ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 22న విడుదల కానుంది.

తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్‌ పతాకంపై చదలవాడ పద్మావతి, చదలవాడ లక్ష్మణ్‌ ఈ చిత్రాన్ని ‘టిక్‌. టిక్‌. టిక్‌’ పేరుతోనే తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ‘‘సినిమా సెన్సార్‌ పూర్తయింది. ఆల్రెడీ రిలీజైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. అంతరిక్షం నేపథ్యంలో రూపొందిన ఫస్ట్‌ ఇండియన్‌ మూవీ ఇది. ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు. ‘బిచ్చగాడు, డీ 16’ సినిమాలను తెలుగులో రిలీజ్‌ చేసినప్పుడు ప్రేక్షకులు ఆదరించారు. వాటిని మించిన విలక్షణమైన చిత్రమిది’’ అన్నారు నిర్మాత చదలవాడ లక్ష్మణ్‌.

మరిన్ని వార్తలు