హాలీవుడ్‌ ఎంట్రీ!

22 Sep, 2018 06:02 IST|Sakshi

బాలీవుడ్‌ యాక్షన్‌ హీరోల లిస్ట్‌లో టైగర్‌ ష్రాఫ్‌ పేరు తప్పకుండా ఉంటుంది. ఏ ‘ప్లైయింగ్‌ జాట్, భాగీ సిరీస్‌’ చిత్రాల్లో టైగర్‌ యాక్షన్‌ టాలెంట్‌ ఏంటో చూశాం. ఇప్పుడీ యాక్షన్‌ హీరో హాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారని బీ టౌన్‌ కోడై కూస్తోంది. ఇటీవల టైగర్‌ ష్రాఫ్‌ను హాలీవుడ్‌ నిర్మాత లారెన్స్‌ కసోనోఫ్‌ మీట్‌ అవ్వడమే ఇందుకు కారణం. టైగర్‌ ఫిజిక్‌కు లారెన్స్‌ ఇంప్రెస్‌ అయ్యారట. తాను తీయాలనుకుంటున్న యాక్షన్‌ మూవీకి టైగర్‌ నప్పుతాడని భావించారట. గతంలో ‘బ్లడ్‌ డిన్నర్, ఫార్‌ ఫ్రమ్‌ హోమ్, ట్రూ లైస్‌’ వంటి భారీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు లారెన్స్‌. ఇదిలా ఉంటే..  హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘రాంబో’ హిందీ రీమేక్‌లో టైగర్‌ ష్రాఫ్‌ నటించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి కాస్త టైమ్‌ పడుతుంది.

మరిన్ని వార్తలు