అక్ష‌య్ అడిగేసరికి భ‌య‌మేసింది: హీరో

13 Jul, 2020 18:52 IST|Sakshi

ముంబై: బాలీవుడ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ యాక్ష‌న్ ఫీట్ల‌కు బోలెడంత‌మంది అభిమానులు ఉన్నాడు. ఎన్నో ర‌కాల‌ విన్యాసాల‌ను సైతం ఆయ‌న అల‌వోకగా చేసేవాడు. ఈ క్ర‌మంలో ఓ టోర్న‌మెంటులో తైక్వాండో విన్యాసాలు చేసిన పాత వీడియోను టైగ‌ర్ సోమ‌వారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో అక్ష‌య్ కుమార్ కూడా ఉండ‌టం విశేషం. టైగ‌ర్ తైక్వాండో చేస్తుండ‌గా అక్ష‌య్ మ‌రిన్ని కిక్కులు కొట్ట‌మంటూ అత‌న్ని ప్రోత్స‌హించాడు. అక్క‌డున్న అభిమానులు సైతం అత‌నిలోని ప్ర‌తిభ‌కు అబ్బుర‌ప‌డిపోతూ చ‌ప్ప‌ట్లు, ఈల‌ల‌‌తో ఉత్తేజాన్ని నింపారు. (టైగర్‌ ష్రాఫ్‌ ఫ్యామిలితో దిశా పటానీ టిక్‌టాక్‌)

ఆనాటి ఈ సంఘ‌ట‌న గురించి యాక్ష‌న్ హీరో త‌న అనుభ‌వాల‌ను గుర్తు చేసుకుంటూ.. "స‌హ‌జంగానే నాకు స్టేజ్ ఎక్కాలంటేనే భ‌యం. అలాంటిది లెజెండ‌రీ హీరో అక్ష‌య్‌.. న‌న్ను ప్రేక్ష‌కుల‌కు కొన్ని కిక్స్ చూపించ‌మ‌ని అడుగుతుంటే మ‌రింత భ‌య‌ప‌డిపోయాను. కానీ ఎలాగోలా త‌డ‌బ‌డ‌కుండా విన్యాసాలు చేసినందుకు సంతోషించాను" అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కు ఆరు ల‌క్ష‌ల మందికి పైగా వీక్షించారు. లాక్‌డౌన్ కాలంలో షూటింగ్స్‌కు బ్రేక్ ప‌డ‌టం, త‌న‌కు కావాల్సిన‌ స‌మ‌యం దొర‌క‌డంతో ఈ హీరో సోష‌ల్ మీడియాలో అభిమానుల‌కు మ‌రింత చేరువ‌య్యాడు. (సుధీర్‌ డ్యాన్స్‌ స్టెప్పులకు టైగర్‌ ఫిదా)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా