దిశా ఇప్పుడు అన్నయ్యతో లేదు

21 Apr, 2020 14:00 IST|Sakshi

లాక్‌డౌన్‌ సమయంలో బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌ దిశాపటాని కలిసి నివసిస్తున్నారన్న వార్తలపై టైగర్‌ సోదరి కృష్ణ ష్రాఫ్‌ స్పందించారు. వారిద్దరూ ప్రస్తుతం కలిసి జీవించడం లేదని కృష్ణా  స్పష్టం చేశారు. దిశాతో ఉంటే అన్నయ్య సంతోషంగా ఉంటారని, ఇద్దరు కలిసి సరదాగా గడుపుతారని ఆమె తెలిపారు. మిజోరాంలో నివసిస్తున్న కృష్ణ లాక్‌డౌన్‌ వల్ల ప్రస్తుతం అన్నయ్య టైగర్‌, ప్రియుడు ఎబాన్ హ్యామ్స్‌‌తో కలిసి ముంబైలో జీవిస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. దిశా తమతో కలిసి లేదని అన్నారు. అయితే తమ ఇంటి సమీపంలోనే నివసిస్తుందని, కిరాణా వస్తువులు కొనడానికి షాప్‌కి వెళ్లినప్పుడు తరుచుగా ఆమెను కలుస్తామని వెల్లడించారు. (సుధీర్‌ డ్యాన్స్‌ స్టెప్పులకు టైగర్‌ ఫిదా)

దిశా పటాని, టైగర్‌ మధ్య సన్నిహిత్యం గురించి మాట్లాడుతూ.. దిశా, టైగర్‌ మంచి స్నేహితులని, దిశాతో తమ కుటుంబమంతా బాగా కనెక్ట్‌ అయ్యామని తెలిపారు. అన్నయ్య టైగర్‌.. దిశాతో ఎక్కువ సమయం గడపడుపుతుంటే  ఆమె మంచి అమ్మాయి అని అర్థమైందని, అన్నయ్యను అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతోందన్నారు. ఇక అన్నయ్య గురించి చెబుతూ... సినిమా షూటింగ్‌ల కారణంగా ఇద్దరం ఎక్కువ రోజులు కలిసి ఉండలేక పోయేవాళ్లం. లాక్‌డౌన్‌ కారణంగా సాధారణ సమయాల్లో కంటే ఇప్పుడు టైగర్‌తో ఎక్కువ సమయం గడపడం ఆనందంగా ఉంది. ఇప్పుడు మా మధ్య బంధం మరింత మెరుగు పడింది. ప్రతి రోజు కలిసే తింటున్నాం. కలిసి ఆటలు ఆడుతున్నాం.’ అని టైగర్‌ గురించి చెప్పుకొచ్చారు సోదరి కృష్ణ ష్రాఫ్‌. (సినిమాల్లోకి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు!)

This is how we do it #quarintinelife @kishushroff 👭🤣

A post shared by disha patani (paatni) (@dishapatani) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా