సిరియా మిలటరీలో శిక్షణ తీసుకోనున్న హీరో

9 Jul, 2018 16:35 IST|Sakshi

‘దేశీ ర్యాంబో’ టైగర్‌ ష్రాఫ్‌ మరోసారి తన యాక్షన్‌ విశ్వరూపం చూపించడానికి రెడి అయ్యాడు. బాగీ మొదటి రెండు సీక్వెల్స్‌లో యాక్షన్‌ సన్నివేశాల్లో ఇరగదీసి, సీనియర్‌ యాక్షన్‌ హీరోలు అక్షయ్‌, జాన్‌ అబ్రహాం ప్రశంసలు పొందిన ఈ దేశీ ర్యాంబో ప్రస్తుతం ‘బాగీ 3’ కోసం  రెడి అవుతున్నట్లు సమాచారం. ‘బాగీ’ చిత్ర నిర్మాత సజీద్‌ నదియవాలా ‘బాగీ 3’ని కూడా నిర్మిస్తానని ‘బాగీ 2’ విడుదల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్‌ ప్రారంభించనున్నారు. ‘బాగీ 3’లో యాక్షన్‌ సన్నివేశాలు గత రెండు చిత్రాలను మించేలా ఉంటాయంటున్నారు చిత్ర దర్శకుడు అహ్మద్‌.

ఈ యాక్షన్‌ సన్నివేశాల కోసం టైగర్‌ ష్రాఫ్‌ ఏకంగా సిరియా మిలటరీ క్యాంప్‌లో శిక్షణ తీసుకోనున్నట్లు సమాచారం. ‘బాగీ 3’లో యాక్షన్‌ సన్నివేశాల్లో అధునాతన ‘ఎమ్‌16’, ‘ఏటీ4’, రాకెట్‌ లాంచర్‌ వంటి ఆయుధాలను వినియోగించనున్నట్లు తెలుస్తోంది. శిక్షణ తీసుకోవడం కోసం ఈ ఏడాది నవంబర్‌లో టైగర్‌ ష్రాఫ్‌ సిరియా మిలటరి క్యాంప్‌కు వెళ్లనున్నాడని చిత్ర దర్శకుడు అహ్మద్‌ఖాన్‌ ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

సినిమా కోసం ఎంతైనా కష్టపడే మనస్తత్వం ఉన్న టైగ్‌ర్‌ ష్రఫ్‌ ‘బాగీ’, ‘బాగీ 2’ చిత్రాలలోని యాక్షన్‌ సన్నివేశాల కోసం మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు