'రజినితో సినిమాకు 300 కోట్లు కావాలి..!'

6 Dec, 2015 11:39 IST|Sakshi
'రజినితో సినిమాకు 300 కోట్లు కావాలి..!'

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ లిస్ట్ సామన్య ప్రేక్షకులతో పాటు టాప్క్లాస్ సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ కూడా రజినీకి బిగెస్ట్ ఫ్యాన్ అట. అంతేకాదు రజినీ లాంటి టాప్స్టార్తో సినిమా చేయటం అంత ఈజీకాదని, ఈ సూపర్ స్టార్తో సినిమా చేయాలంటే కనీసం మూడు, నాలుగు వందల కోట్ల బడ్జెట్ కావాలంటూ తన అభిమాన నటుణ్ణి ఆకాశానికి ఎత్తేవాడు సాజిద్.

'రజినీ కాంత్ ఇమేజ్కు తగ్గ సినిమా చేయటం మామూలు విషయం కాదు. రోబో, శివాజీ లాంటి సినిమాలతో రజినీ కాంత్ను అద్భుతంగా చూపించిన శంకర్కు హాట్సాఫ్. ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్న రజినీ హీరోగా సినిమా తెరకెక్కించాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సినిమా కంటే నటుడు గొప్పగా అనిపించటం చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటి నటుడే రజినీ. సినిమా చూడటం కన్నా, రజినీ కాంత్ ను చూడటానికే ఎక్కువ మంది థియేటర్లకు వస్తారు. అందుకు తగ్గట్టుగా సినిమా తెరకెక్కించాల్సి ఉంటుంది.'  అంటూ రజినీకాంత్ను పొగడ్తలతో ముంచెత్తాడు సాజిద్.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి