ఏం జరిగింది?

12 Feb, 2017 23:28 IST|Sakshi
ఏం జరిగింది?

‘‘పెళ్లి అంటే ఇష్టంలేని ఓ అమ్మాయి, ఓ అబ్బాయి.. కొన్ని పరిస్థితుల వల్ల నాలుగు రోజులు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఏం జరిగింది అన్నది ఆసక్తికరం’’ అని దర్శకుడు ఎల్‌.రాధాకృష్ణ తెలిపారు. వెంకీ, లాస్య జంటగా ఎల్‌.రాధాకృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ దీపక్‌ కృష్ణ నిర్మించిన చిత్రం ‘తొలి పరిచయం’. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను నిర్మాత మల్కాపురం శివకుమార్‌ విడుదల చేశారు.

దర్శకుడు మాట్లాడుతూ– ‘‘యూత్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. పోలవరం పరిసరాల్లో షూటింగ్‌ జరిపాం. చిన్న చిత్రమైనా క్వాలిటీ విషయంలో నిర్మాత రాజీ పడలేదు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘ఫస్ట్‌ లుక్‌లాగే సినిమా కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. త్వరలో పాటలు విడుదల చేస్తాం’’ అని వెంకీ చెప్పారు. సంగీత దర్శకుడు ఇంద్రగంటి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శరవణ కుమార్‌ సి.