టాలీవుడ్‌ నటుడు వినోద్‌ మృతి

14 Jul, 2018 07:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌ సీనియర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టు వినోద్‌(అసలు పేరు అరిసెట్టి నాగేశ్వర రావు) మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. వినోద్‌ 1980లో కీర్తి కాంత కనకం సినిమాతో సినీ రంగప్రవేశం చేశారు. మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. 28 తమిళ సినిమాలు, రెండు హిందీ సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలో కూడా నటించారు.

తెలుగు సినిమాల్లో చంటి, నల్లత్రాచు, లారీ డ్రైవర్, ఇంద్ర, నరసింహనాయుడు, భైరవద్వీపంలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వినోద్‌కు భార్య వీనావతి, పిల్లలు శిరీష, సురేష్‌, తేజస్విలు ఉన్నారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వినోద్ మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపం తెలిపింది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

కమాండర్‌ విజయ్‌

సౌత్‌కి బదాయి హో

కష్టమంతా మరచిపోయాం

డబ్బు కోసం కాదు.. కథ నచ్చి చేశా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

సమ్మరంతా సమంత

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు

‘మా’ను రోడ్డు మీదకు తీసుకురాకండి

ఇక ప్రేమ యుద్ధం

గొప్ప మనసు చాటుకున్న మంచు విష్ణు