పార్టీ మూడ్‌

1 Jan, 2020 01:32 IST|Sakshi

న్యూ ఇయర్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పడానికి తారలందరూ తమకు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లేందుకు అంతా సెట్‌ చేసుకున్నారు. ఫుల్‌ జోష్‌తో దిల్‌ ఖుష్‌ అయ్యేలా రెగ్యులర్‌ షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చి పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోయారు. టాలీవుడ్‌లో ఎక్కువమంది తారలు గోవా తీరంలో సేద తీరడానికి ఇష్టపడుతున్నట్లు తెలిసింది. స్టార్‌ హీరో మహేశ్‌బాబు కుటుంబ సమేతంగా ముంబైలో ఉన్నారు. రామ్‌చరణ్‌ గోవాలో ల్యాండ్‌ అయ్యారు. అల్లు అర్జున్‌ బ్యాంకాంక్‌లో వాలిపోయారు. తన శ్రీమతి సమంతతో కలిసి రెండు రోజులు ముందుగానే గోవా వెళ్లారు నాగచైతన్య. ఇంకా సాయిధరమ్‌తేజ్, వరుణ్‌ తేజ్, లక్ష్మీమంచు కూడా 2020 సెలబ్రేషన్స్‌కు గోవానే ఎంచుకున్నారని తెలిసింది. ఇక హీరోయిన్‌ పూజా హెగ్డే ఆ్రస్టియాలో అడుగుపెట్టారు.

తన బెస్ట్‌ ఫ్రెండ్, హీరోయిన్‌ వాణీకపూర్‌తో కలిసి లండన్‌లో మస్తీ చేస్తున్నారు రాశీఖన్నా. ఆకాంక్షాసింగ్‌ న్యూయార్క్‌ వీధుల్లో విహరిస్తున్నారు. మేఘా ఆకాష్‌ స్పెయిన్‌ తీరంలోని చల్లగాలులను ఆస్వాదిస్తున్నారు. బ్యాగ్‌ సర్దుకుని శ్రీలంకకు వెళ్లారు ఐశ్వర్యారాజేష్. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. ఇక ఏడాదిలో తొలిరోజును షూటింగ్‌ లొకేషన్‌లో గడపనున్నారు నిధీ అగర్వాల్‌.  అంతేకాదు.. ఈ ఏడాది రెండు స్వచ్ఛంద సేవా సంస్థలకు తన వంతు సాయం అందించాలనుకుంటున్నారు నిధి. ఆ్రస్టియాలో పరిణీతిచోప్రా, స్విట్జర్లాండ్‌లో అనుష్కాశర్మలతో పాటు మరికొందరు తమ తమ ఫేవరెట్‌ లొకేషన్స్‌కు వెళ్లి  న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ను జరుపుకోనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా