చరణ్‌ విషయంలో అలా అనిపించింది : చిరు

27 Mar, 2020 10:17 IST|Sakshi

రామ్‌చరణ్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపిన సినీ ప్రముఖులు

చిరుత సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్‌, ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. పలు బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచాడు. డ్యాన్స్‌, యాక్షన్‌ సీన్స్‌లలో తండ్రిని గుర్తుచేసేలా మెగా అభిమానుల్లో జోష్‌ నింపాడు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ రౌద్రం రణం రుధిరం(ఆర్‌ఆర్‌ఆర్‌)లో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నారు. కాగా, శుక్రవారం(మార్చి 27) పుట్టిన రోజు జరుపుకుంటున్న రామ్‌చరణ్‌కు ఆయన తండ్రి చిరంజీవితోపాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ట్విటర్‌లో రామ్‌చరణ్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పిన చిరంజీవి.. ఓ అరుదైన ఫొటోను షేర్‌ చేశాడు. ‘చరణ్‌ పుట్టినప్పుడు సహజంగానే నేను చాలా ఆనందపడ్డాను. చరణ్‌ మార్చి 27న(ప్రపంచ రంగస్థల దినోత్సవం) జన్మించడానికి ఓ కారణం ఉండొచ్చని కొద్ది రోజుల తర్వాత నాకు అనిపించింది. నీటిలో చేపలా.. చరణ్‌కు కూడా నటన నేర్చుకున్నాడు. ఈ సందర్భంగా చరణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను’అని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, అర్ధరాత్రి నుంచి తనకు బర్త్‌ డే విషెస్‌ చెబుతున్న వారందరికీ రామ్‌చరణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రతి ఒక్కరు లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ఇంట్లోనే ఉండాలని.. అదే మీరు నాకు ఇచ్చే మంచి గిఫ్ట్‌’  అని తెలిపారు. 

► స్వీటెస్ట్‌ బ్రదర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నాకు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉన్నందుకు ధన్యవాదాలు. ఉత్తమమైన వాటికి నువ్వు అర్హుడివి. నీకు ఈ ఏడాది ఆనందం, నవ్వు, ప్రేమ, విజయంతో నిండాలని కోరకుంటున్నాను. లవ్‌ యూ చరణ్‌ అన్న
- నిహారిక కొణిదెల

► నా బ్రదర్‌ రామ్‌చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది నీకు జీవితంలో మరిన్ని విజయాలు, సంతోషం కలగాలని కోరుకుంటున్నా. ఈరోజు నిన్ను కలవాలని అనుకున్నాను.. కానీ ప్రస్తుతం మనం ఐసోలేషన్‌లో ఉండటమే మంచింది.
- అల్లు అర్జున్‌

 చరణ్‌ బ్రదర్‌. నీ బర్త్‌డే మంచి పరిస్థితుల మధ్య జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కానీ మనం లాక్‌డౌన్‌లో ఉన్నందున్న ఇంటికి పరిమితం అవడం ముఖ్యమం. నీకు ఉదయం 10 గంటలకు డిజిటల్‌ సర్‌ఫ్రైజ్‌ ఇస్తాను. నన్ను నమ్ము నువ్వు దీనిని మరచిపోలేవు. సారీ బ్రదర్‌. గత రాత్రి నీ గిఫ్ట్‌ను జక్కన్న(రాజమౌళి) అభిప్రాయం కోసం అతనికి పంపాను. అక్కడున్నది రాజమౌళి కాబట్టి.. అది ఎలా ఉంటుందో నీకు తెలుసు. కొద్దిపాటి ఆలస్యం
- ఎన్టీఆర్‌

 హ్యాపీ బర్త్‌డే చరణ్‌. ఆ భగవంతుడు నీకు ఆనందం, ప్రేమ, ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మనం చిన్నతనంలో వెళ్లిన ఓ షూటింగ్ అప్పటి ఫొటో ఇది- సాయిధరమ్‌ తేజ్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా