కరోనా విరాళం

29 Mar, 2020 01:57 IST|Sakshi

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా తారలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు, ఇప్పటికే పలువురు తారలు విరాళాలిచ్చారు. శనివారం విరాళం ప్రకటించిన వారి వివరాలు.

► దగ్గుబాటి ఫ్యామిలీ
(సురేష్‌ బాబు, వెంకటేష్, రానా) – 1 కోటి  (ఆరోగ్య శాఖ వర్కర్లకు, సినీ వర్కర్లకు కలిపి)

► నాగార్జున – 1 కోటి
(సినీ వర్కర్స్‌ సహాయార్థం)

► మహేశ్‌ బాబు – 25 లక్షలు 
( కరోనా క్రై సిస్‌ చారిటీకి ) (ఆల్రెడీ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు కలిపి కోటి రూపాయిలు ప్రకటించారు)

► రామ్‌చరణ్‌ – 30 లక్షలు
(సినీ వర్కర్స్‌ సహాయార్థం).

► నాగచైతన్య
(ఉపాధి కోల్పోయిన తెలుగు సినీ కార్మికులు సంక్షేమం కోసం)

► నిఖిల్‌
– తెలుగు రాష్ట్రాల్లోని డాక్టర్స్, హెల్త్‌ వర్కర్స్‌కు పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ)ను అందించి కరోనా సమయంలో తన వంతు సాయం చేశారు నిఖిల్‌. 2 వేల రిస్పైరేటర్స్, 2 వేల రీ యూజబుల్‌ గ్లౌజ్స్, 2 వేల ఐప్రొటెక్షన్‌ గ్లాసెస్, శానిటైజర్స్‌ లతో పాటుగా పది వేలమాస్క్‌లను అందజేశారు.

► కార్తికేయ – 2లక్షలు
(రోజు వారి వేతనాలు తీసుకునే సినీ కార్మికుల కోసం)

► లావణ్యా త్రిపాఠి – 1 లక్షల
(రోజు వారి వేతనాలు తీసుకునే సినీ కార్మికుల కోసం)

మరిన్ని వార్తలు