-

‘అమ్మ నీ త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోము’

17 Jun, 2020 11:40 IST|Sakshi

భారత వీర జవాన్లకు టాలీవుడ్‌ అశ్రునివాళి

టిక్‌టాక్‌ నుంచి మొదలు చైనా వస్తువులను బహిష్కరించాలి

అమ్మ నీ త్యాగం మర్చిపోం.. మేమందరం మీతోనే ఉన్నాం: నిఖిల్‌

సాక్షి, హైదరాబాద్‌: భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన భారత జవానులకు యావత్‌ దేశం కన్నీటి నివాళి అర్పించింది. శాంతిమంత్రం జపిస్తూ దందుడుకుగా యుద్ధోన్మాదాన్ని ప్రేరేపిస్తున్న చైనా వైఖరిని దేశ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. చైనా సైనికులతో ఘర్షణలో భారత సైన్యానికి చెందిన కల్నల్‌ సంతోష్‌ బాబుతో పాటు మరో 19 మంది భారత జవాన్లు మృతిచెందినట్లు ఆర్మీ ప్రకటించింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు చెలరేగుతుండగా.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ట్వీట్లతో ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. (తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన తనయుడు)

అమ‌ర‌వీరుల మృతిపై టాలీవుడ్ ప్ర‌ముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్య‌క్తం చేశారు. దేశం కోసం ప్రాణాలు విడిచిన అమ‌ర‌వీరుల ఆత్మ‌కి శాంతి క‌లగాల‌ని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహేశ్‌ బాబు, దేవిశ్రీప్రసాద్‌, నిఖిల్‌ సిద్దార్థ‌, అనిల్‌ సుంకర, ప్రణీత, మంచు విష్ణు, లక్ష్మీ మంచు, వరుణ్‌ తేజ్‌, అనిల్‌ రావిపూడి, తదితరులు వీరజవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. చైనా అహంకార చర్యలపై నా రక్తం మరిగిపోతోందని, టిక్‌టాక్‌ నుంచి మొదలు చైనా వస్తువులన్నింటిని బహిష్కరించాలని నిఖిల్‌ పిలుపునిచ్చాడు. అంతేకాకుండా వీర జవాను సంతోష్‌ బాబు తల్లిని ఉద్దేశిస్తూ ‘అమ్మ నీ త్యాగాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము. మేమందరం మీతోనే ఉన్నాం. ధైర్యంగా ఉండండి’ అంటూ నిఖిల్‌ మరో ట్వీట్‌ చేశారు. (విషం చిమ్మిన చైనా..)

మరిన్ని వార్తలు