ఎన్‌కౌంటర్‌పై టాలీవుడ్‌ స్పందన

6 Dec, 2019 10:48 IST|Sakshi

దిశ హత్యోందంతం అందరి మనసులను కలిచివేసింది. దిశపై అత్యాచారానికి ఒడిగట్టి అతి కిరాతకంగా హతమార్చిన నిందితులకు ప్రాణాలతో బతికే అర్హత లేదంటూ సమస్త ప్రజానీకం గొంతెత్తి నినదించింది. ఈ క్రమంలో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై టాలీవుడ్‌ నటీనటులు హర్షం వ్యక్తం చేశారు. దిశకు న్యాయం చేకూరిందని కింగ్‌ నాగార్జున, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌, అఖిల్, రవితేజ, నిఖిల్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో నేడు దిశ ఆత్మ శాంతిస్తుందని హీరో ఎన్టీఆర్‌ అభిప్రాయపడ్డాడు. ‘ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి.. వాడు పోలీసు అయ్యుండాలి’ అంటూ నాని ఎన్‌కౌంటర్‌ను స్వాగతించాడు.

ఈ ఘటనపై టాలీవుడ్‌ బ్యూటీ సమంత స్పందిస్తూ కొన్నింటికి భయపెట్టడమే సరైన సమాధానం అని చెప్పుకొచ్చింది. దానివల్లైనా నేరాలు జరగకుండా ఉండేందుకు అవకాశముందని అభిప్రాయపడింది. ఇందువల్లే తెలంగాణ అంటే తనకెంతో ఇష్టమని తెలిపింది. అత్యాచారం వంటి ఘోర నేరాలు చేసిన నిందితులు తప్పించుకుని పారిపోలేరంటూ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ స్పందించింది. ఈ సందర్భంగా నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. నిందితులను తగిన శిక్ష పడినందుకు గర్వంగా ఫీల్‌ అవుతున్నానంటూ ప్రముఖ యాంకర్‌ అనసూయ పేర్కొంది. దిశకు సరైన న్యాయం జరిగిందని హీరోయిన్లు లావణ్య త్రిపాఠి, సమంత అక్కినేని, విశాల్‌ తదితరులు స్పందించారు.

చదవండి:

దిశ నిందితుల ఎన్కౌంటర్

దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్..

మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా