హాస్యనటుడు వేణు మాధవ్‌ కన్నుమూత

25 Sep, 2019 12:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్‌ కన్నుమూశారు. సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్‌ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నెల 7వ తేదీన ఆయనను చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు యశోదా ఆస్పత్రిలో చేర్చారు.  అయితే వేణు మాధవ్‌ చనిపోయారంటూ సోషల్‌ మీడియాలో నిన్నటి నుంచే వార్తలు హల్‌చల్‌ చేశాయి. అయితే వాటిని కుటుంబసభ్యులు ఖండించారు. ఈ నేపథ్యంలో ఇవాళ మధ‍్యాహ్నం ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు, ఆస్పత్రి వైద్యులు అధికారికంగా నిర్థారించారు. వేణు మాధవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు. కాగా కొద్ది నెలల క్రితం వేణు మాధవ్‌ సోదరుడు విక్రమ్‌ బాబు గుండెపోటుతో మృతి చెందారు.

ఫ్యామిలీతో వేణుమాధవ్‌ 
వేణుమాధవ్‌ స్వస్థలం నల్గొండ జిల్లా కోదాడ. 1997 సంవత్సరంలో సంప్రదాయం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయిన ఆయనకు ‘తొలిప్రేమ’ చిత్రంతో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ‘లక్ష్మి’ చిత్రంలో నటించిన పాత్రకు వేణు మాధవ్‌కు నంది అవార్డు వరించింది. వేణు మాధవ్‌ మృతిపట్ల టాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆమెకు నిర్ణయం తీసుకునే సత్తా ఉంది’

వేణుమాధవ్‌ నన్ను బావా అని పిలిచేవాడు

‘చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు’

రాజకుమారి మాలగా పూజ

వేణుమాధ‌వ్ మృతి: చిరంజీవి దిగ్భ్రాంతి

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం

వేణు మాధవ్‌ కోలుకుంటారనుకున్నా : పవన్‌

ఆ హీరోకు 30వేల పెళ్లి ప్రపోజల్స్‌

నవ్వు చిన్నబోయింది

బిగ్‌బాస్‌: ఏంటి? కొడతావా అంటూ వరుణ్‌ ఫైర్‌!

హిట్‌ సినిమాకు పైరసీ విలన్‌

సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తాం!

‘ఇప్పటికి ఆమెను గౌరవిస్తున్నాను’

ప్రభాస్‌కు ప్రతినాయకుడిగా..!

అలాంటి పాత్రలకు పారితోషికం తగ్గించుకుంటా!

నటి జెన్నీఫర్‌ మోసగత్తె ..!

మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్టు, ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌?

పనికిమాలిన వారు సినిమాల్లోకి రావచ్చు..

అడవుల్లో వంద రోజులు!

ఆర్‌ఎక్స్‌ 100 నేను చేయాల్సింది

బ్రేకప్‌!

మంచి సినిమాని ప్రోత్సహించాలి

దాదా.. షెహెన్‌షా

కొత్త కథాంశం

నా తల్లి కారణంగా రేప్‌కి గురయ్యా!

మా సైన్మాని సక్సెస్‌ చేసినందుకు ధన్యవాదాలు

కాంబినేషన్‌ కుదిరిందా?

‘నల్లబాలు.. నల్లతాచు లెక్క.. నాకి చంపేస్తా...’

నేను మౌలాలి మెగాస్టార్‌ని!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆమెకు నిర్ణయం తీసుకునే సత్తా ఉంది’

వేణుమాధవ్‌ నన్ను బావా అని పిలిచేవాడు

‘చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు’

రాజకుమారి మాలగా పూజ

వేణుమాధ‌వ్ మృతి: చిరంజీవి దిగ్భ్రాంతి

ప్రభాస్‌కు ప్రతినాయకుడిగా..!