తెలుగు చలనచిత్ర దర్శకుల మండలి అధ్యక్షునిగా ఎన్‌. శంకర్‌

12 Mar, 2018 04:45 IST|Sakshi
ఎన్‌.శంకర్‌

హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన తెలుగు చలన చిత్ర దర్శకుల మండలి ఎన్నికల్లో ప్రముఖ దర్శకుడు ఎన్‌.శంకర్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి సానా యాదిరెడ్డిపై 310 ఓట్ల మెజారిటీతో ఎన్‌.శంకర్‌ గెలుపొందారు. ఎన్‌.శంకర్‌తో పాటు ఆయన ప్యానల్‌ సభ్యులు ప్రధాన కార్యదర్శిగా జి. రాం ప్రసాద్, కోశాధికారిగా కాశీ విశ్వనాద్, ఉపాధ్యక్షులుగా ఏ.యస్‌.రవి కుమార్‌ చౌదరి, ఎస్‌.వి.భాస్కర్‌ రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా కట్టా రంగారావు, ఎమ్‌.ఎస్‌.శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా  డీవీ రాజు(కళింగ), ఎన్‌ గోపీచంద్‌ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా శ్రీకాంత్‌ అడ్డాల, అనిల్‌ రావిపుడి, ప్రియదర్శిని, గంగాధర్, అంజిబాబు, మధుసూదన్‌ రెడ్డి, కృష్ణ మోహన్, కృష్ణ బాబు, చంద్రకాంత్‌ రెడ్డి విజయం సాధించారు. నూతన కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతుంది.

మరిన్ని వార్తలు