‘ప్రభాస్‌-అమీర్‌లతో మల్టీస్టారర్‌ చిత్రం చేయాలి’

1 May, 2020 17:17 IST|Sakshi

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాను అద్భుతంగా తెరకెక్కించి టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే.  తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రానికి సీక్వెల్‌ తీసే పనిలో ఉన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు రద్దు కావడంతో ఇంటికే పరిమితైమన ఈ యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ తన తదుపరి చిత్రాల స్క్రిప్ట్‌ పనిలో నిమగ్నమయ్యారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్వరూప్‌ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్స్‌, ఆలోచనలను అభిమానులతో పంచుకున్నాడు. 

‘నాకు మల్టీస్టారర్‌ చిత్రాలంటే ఇష్టం. అయితే పర్ఫెక్ట్‌ కాన్సెప్ట్‌ దొరికితే తప్పకుండా మల్టీస్టారర్‌ చిత్రం చేస్తా. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌లతో ఓ మల్టీస్టారర్‌ చిత్రం తెరకెక్కించాలనే కోరిక ఉంది. అదేవిధంగా ప్రభాస్‌-ఆమీర్‌ ఖాన్‌ కలయికలో పాన్‌ ఇండియా రేంజ్‌లో మరో చిత్రాన్ని తీయాలనే ఆలోచన ఉంది. ఈ హీరోల కలయికలో సినిమాలు వస్తే ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తాయి. అయితే ఇలాంటి స్టార్‌ హీరోలతో సినిమాలు తీయాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే. అంతేకాకుండా మెగాస్టార్‌ చిరంజీవి అంటే ఎంతో అభిమానం. ఆయనతో సినిమా చేయడం నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌’ అని దర్శకుడు స్వరూప్‌ పేర్కొన్నారు.   

చదవండి:
అవ్రమ్‌కు హెయిర్‌ కట్ చేసిన విరానిక
నిహారిక, యశ్‌ల డ్యాన్స్‌ చూశారా?


మరిన్ని వార్తలు