చంచల్‌గూడ జైల్లో టాలీవుడ్ హీరో

9 Jul, 2017 09:05 IST|Sakshi
చంచల్‌గూడ జైల్లో టాలీవుడ్ హీరో

హైదరాబాద్‌: టాలీవుడ్ నూతన దర్శకుడు వీఐ ఆనంద్‌ డైరెక్షన్‌లో మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్‌, సురభి జంటగా ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ కొత్త సినిమా షూటింగ్‌ శనివారం చంచల్‌గూడ పురుషుల జైల్లో జరిగింది. దీంతో జైలు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. శిరీష్, అవసరాల  శ్రీనివాస్, ప్రవీణ్‌లపై జైలు బయట, లోపల కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్‌ అనంతరం మహాపరివర్తన్‌లో భాగంగా అల్లు శిరీష్‌ ఖైదీలను ఉద్దేశించి మాట్లాడారు.

తెలిసి, తెలియక చేసిన తప్పులకు జైలు శిక్ష అను భవిస్తున్న ఖైదీలు తప్పులను సరిదిద్దుకొవాలని ఆయన సూచించారు. చంచల్‌గూడ జైల్లో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ సమ్మయ్య, జైలర్లు విజయ్‌కుమార్, వెంకటేశం ఉన్నారు. మరోవైపు ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో వేగంగా జరుగుతోంది. సీరత్‌ కపూర్‌ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరకర్తగా ఉన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి