స్క్రీన్‌ టెస్ట్‌

1 Feb, 2019 05:50 IST|Sakshi

ప్రతిభకు కొలమానం ఏంటి? అంటే చెప్పలేం. అయితే ప్రతిభను గుర్తించి ప్రేక్షకులు కొట్టే చప్పట్లు, అభినందనలు, ప్రతిష్టాత్మక పురస్కారాలు ఏ కళాకారుడిలో అయినా ఉత్సాహాన్ని నింపుతాయి. భారతదేశ ప్రతిష్టాత్మక పురస్కారం అయిన ‘పద్మ’  అవార్డు వరిస్తే ఆ గౌరవమే వేరు. జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించిన సందర్భంగా ఇప్పటివరకూ  ఈ అవార్డు అందుకున్న  స్టార్స్‌లో కొందరి గురించి  ఈ వారం స్పెషల్‌ క్విజ్‌.

1. ‘పడమటి సంధ్యారాగం’ చిత్రంలో సహాయ నటునిగా నటించారు ఈ నటుడు. 2019వ సంవత్సరంలో ఈయనను పద్మశ్రీ వరించింది. సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎవరాయన?  
ఎ) మణిశర్మ  బి) యం.యం. కీరవాణి   సి) శివమణి డి) కోటి

2. 2011వ సంవత్సరానికి పద్మశ్రీ అవార్డుగ్రహీత ఈ నటి. వెంకటేశ్‌ నటించిన ఓ సూపర్‌హిట్‌ సినిమా ద్వారా తెరంగేట్రం చేశారీమె. ఎవరా నటి?
ఎ) టబు బి) రమ్యకృష్ణ   సి) మీనా డి) కత్రినా కైఫ్‌

3. 1968లో పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్‌లను దక్కించుకున్న ఏకైక నటుడెవరు?
ఎ) యస్వీ రంగారావు బి) శోభన్‌బాబు సి) కాంతారావు డి) అక్కినేని నాగేశ్వరరావు

4. అద్భుతమైన నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, సింగర్‌గా చాలా ఫేమస్‌ ఈ నటి. 1966లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్‌ అవార్డులను తన ఖాతాలో వేసుకున్న ఆ నటి ఎవరు?
ఎ) భానుమతి బి) జమున సి) సావిత్రి డి) అంజలీదేవి

5. కామెడీ యాక్టర్‌గా ఎన్నో సంవత్సరాలు చిత్రపరిశ్రమను ఏలారు. 1990లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ ప్రకటించింది. ఆ నటుని పేరేంటి?
ఎ) అల్లు రామలింగయ్య బి) పద్మనాభం     సి) సుత్తివేలు డి) నగేశ్‌

6. 2019వ సంవత్సరానికి గాను ప్రభుదేవాని పద్మశ్రీ వరించింది. తన నృత్యంతో అలరించిన ఆయన్ను ఏ ప్రభుత్వం పద్మశ్రీకి నామినేట్‌ చేసిందో తెలుసా?
ఎ) తమిళనాడు బి) తెలంగాణ సి) కర్ణాటక డి) కేరళ

7. ‘సిరివెన్నెల’ చిత్రం తర్వాత చెంబోలు సీతారామశాస్త్రి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా మారిపోయారు. ఆయన్ను చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడెవరు? (సీతారామ శాస్త్రికి ‘సిరివెన్నెల’ మొదటి చిత్రం కాదు)
ఎ) కె.రాఘవేంద్రరావు బి) కె.విశ్వనాథ్‌ సి)ఆదుర్తి సుబ్బారావు డి) దాసరి నారాయణరావు

8. తన గళంతో ఎన్నో భాషల్లోని పాటలను అలవోకగా ఆలపించే గాయకుడు కె.జె. ఏసుదాస్‌. భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ (1977), పద్మభూషణ్‌ (2002), పద్మవిభూషణ్‌లతో సత్కరించింది. ఆయన ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్‌ అందుకున్నారో తెలుసా? (సి)
ఎ) 2011 బి) 2013 సి) 2017 డి) 2009

10 1968లో పద్మశ్రీ అవార్డు పొందిన నటుడెవరో కనుక్కుందామా?
ఎ) యన్టీఆర్‌ బి) చిత్తూరు నాగయ్య  సి) గుమ్మడి డి) కాంతారావు

9. 2006లో ఆయన్ను కేంద్రప్రభుత్వం పద్మభూషణ్‌తో గౌరవించింది. అదే సంవత్సరం ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నుండి డాక్టరేట్‌ను కూడా పొందారు. ఎవరా హీరో?
ఎ) కృష్ణంరాజు బి) చిరంజీవి సి) బాలకృష్ణ డి) నాగార్జున

11. 2009లో పద్మశ్రీ అవార్డు పొందిన ఈ నటుడు అప్పటికే ఒకే భాషలో దాదాపు 700 చిత్రాలు పైగా నటించారు. ఎవరతను?
ఎ) కైకాల సత్యనారాయణ బి) అలీ సి) బ్రహ్మానందం డి) ధర్మవరపు çసుబ్రహ్మణ్యం

12. కమల్‌హాసన్‌ నటించిన ‘శుభసంకల్పం’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు ఈయన. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్‌ అవార్డులను అందుకున్నారు. ఎవరితను?
ఎ) దాసరి నారాయణరావు బి) టి. సుబ్బరామిరెడ్డి సి) ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డి) డి. రామానాయుడు

13. అనేక భాషల్లో తన సంగీతం ద్వారా చాలా సుపరిచుతులు ఈయన. 2010లో పద్మభూషణ్, 2018లో పద్మవిభూషణ్‌ ఆయన్ను వరించాయి. ఎవరా సంగీత దర్శకుడు?
ఎ) కె.వి. మహదేవన్‌ బి) ఇళయరాజా  సి) మంగళంపల్లి బాలమురళీ కృష్ణ   డి) పి.బి. శ్రీనివాస్‌

14. 2013వ సంవత్సరంలో కేంద్రప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మభూషణ్‌ అవార్డ్‌ను తిరస్కరించిన ప్రముఖ సింగర్‌ ఎవరో తెలుసా? (అవార్డును నిరాకరించటానికి ఆ సింగర్‌ చెప్పిన కారణం ఇప్పటికే చాలా లేట్‌ అయ్యింది అని)
ఎ) ఎస్‌. జానకి బి) పి. సుశీల సి) వాణీ జయరాం డి) జిక్కీ

15. కర్ణాటక ప్రభుత్వ సిఫార్సుతో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి పద్మశ్రీ అవార్డును దక్కించుకున్నారు. ఆయన ఏ సంవత్సరంలో ఈ అవార్డును పొందారో తెలుసా?
ఎ) 2014 బి) 2016 సి) 2018 డి) 2019

16. 340 తెలుగు చిత్రాలకు పైగా నటించారు ఈ ప్రముఖ నటుడు. 2009లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మభూషణ్‌ ప్రకటించింది. ఎవరా హీరో?
ఎ) కృష్ణ బి) కృష్ణంరాజు సి) శోభన్‌బాబు డి) శరత్‌బాబు

17. కళలు, విద్యా రంగాలకు సంబంధించి 2007లో పద్మశ్రీ అవార్డును పొందిన ప్రముఖ తెలుగు నటుడెవరో తెలుసా?
ఎ) మోహన్‌బాబు బి) మురళీమోహన్‌   సి) శ్రీధర్‌ డి) రంగనాథ్‌

18. 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్‌ అవార్డులను సొంతం చేసుకున్న ప్రముఖ హీరో ఎవరు?
ఎ) కమల్‌హాసన్‌  బి) రజనీకాంత్‌ సి) విక్రమ్‌  డి) శరత్‌కుమార్‌

19. నాటకరంగం నుండి సినిమా రంగానికి వచ్చి ఎన్నో సినిమాల్లో నటించారు ఈ ప్రముఖ క్యారెక్టర్‌ నటుడు. 2015లో ఆయన్ను పద్మశ్రీ వరించింది. ఎవరా నటుడు కనుక్కోండి?
ఎ) జయప్రకాశ్‌ రెడ్డి బి) తనికెళ్ల భరణి సి) బెనర్జీ డి) కోట శ్రీనివాసరావు

20 .1992లో పద్మశ్రీ అవార్డు పొందారు ఈ ప్రముఖ దర్శకుడు. 2017లో భారత ప్రభుత్వం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. ఆ దర్శకుని పేరేంటి?
ఎ) కె. భాగ్యరాజా బి) భారతీరాజా సి) కె. విశ్వనాథ్‌ డి) కె. బాలచందర్‌

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) (సి) 2) (ఎ) 3) (డి) 4) (ఎ) 5) (ఎ) 6) (సి) 7) (బి) 8) (సి) 9) (బి) 10) (ఎ) 11) (సి)
  12) (సి) 13) (బి) 14) (ఎ) 15) (బి) 16) (ఎ) 17) (ఎ) 18) (బి) 19) (డి) 20) (సి)

నిర్వహణ: శివ మల్లాల

మరిన్ని వార్తలు