స్క్రీన్‌ టెస్ట్‌

30 Mar, 2018 00:07 IST|Sakshi

► అక్కినేని నాగార్జున సరసన తొలిసారి హీరోయిన్‌గా నటించిన నటి ఎవరు?
ఎ) అమలా అక్కినేని  బి) గౌతమి  సి) సుహాసిని             డి) శోభన

► శ్రీకాంత్, స్నేహ జంటగా నటించిన ‘రాధాగోపాళం’ చిత్రానికి బాపు దర్శకుడు. ఆ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తి ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్‌ హీరో? ఎవరా హీరో?
ఎ) నాని       బి) విజయ్‌కృష్ణ సి) నరేశ్‌    డి) విజయ్‌ దేవరకొండ

► చిరంజీవితో 20 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన దర్శకుడెవరో తెలుసా?
ఎ) ఎ. కోదండరామిరెడ్డి బి) బి. గోపాల్‌  సి) దాసరి నారాయణరావు డి) కె. రాఘవేంద్రరావు

► ‘ప్రేమనగర్‌’ అనే చిత్రం ద్వారా తన సురేశ్‌ ప్రొడక్షన్‌ సంస్థ నిలబడిందని నిర్మాత డి.రామానాయుడు ఎన్నోసార్లు చెప్పారు. ఆ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? (చిన్న క్లూ– ఆ చిత్రదర్శకుని కుమారుడు కూడా ప్రముఖ దర్శకుడే)
ఎ) బోయిన సుబ్బారావు   బి) కె. విశ్వనాథ్‌ సి) కె.యస్‌. ప్రకాశరావు   డి) వి.మధుసూదన్‌రావు

► ‘విన్నర్‌’ సినిమాకి యాంకర్‌ సుమ ఓ పాట పాడింది. ఆమె పాడిన పాటలో ఓ యాంకర్‌  నటించారు. ఎవరా యాంకర్‌?
ఎ) రేష్మి గౌతమ్‌   బి) అనసూయ సి) ఝాన్సీ   డి) శిల్పా చక్రవర్తి

► ప్రభాస్‌ నటించిన ‘మిర్చి’ సినిమాలో ‘మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రోడే’ అనే పాటలో నటించిన తార ఎవరో తెలుసా?
ఎ) అనుష్క    బి) రిచా గంగోపాధ్యాయ   సి) హంసా నందిని    డి) ముమైత్‌ఖాన్‌

► చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో ఒక ప్రముఖ హీరోయిన్‌ చిరంజీవితో మొదటిసారిగా నటిస్తున్నారు. ఎవరామె?
ఎ) రమ్యకృష్ణ   బి) మీనా     సి) నయనతార   డి) టబు

► హీరో నాని  ‘కృష్ణార్జున యుద్ధం’అనే చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు.  ఈ చిత్రంతో కలిపి ఇప్పటివరకు నాని ఎన్ని చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారో గుర్తు తెచ్చుకోండి?
ఎ) 3    బి) 2    సి) 4    డి) 1

► యోగా గురువు ‘భరత్‌ ఠాగుర్‌’ తెలుగులో ఎన్నో మంచి సినిమాల్లో నటించిన హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఆ హీరోయిన్‌ పేరేంటో చెప్పేయండి?
ఎ) సంగీత    బి) సిమ్రాన్‌      సి) స్నేహ        డి) భూమిక

► దర్శకుడు మణిరత్నం 1983వ సంవత్సరంలో మొదటిసారిగా దర్శకునిగా అరంగేట్రం చేశారు. ఆయన ఏ భాషలో తన మొదటి సినిమాను తెరకెక్కించారో తెలుసా?
ఎ) కన్నడ     బి) మలయాళం    సి) తమిళ్‌    డి) తెలుగు

► ‘ఊపిరి’ సినిమాలో నాగార్జున పర్సనల్‌ సెక్రటరీగా పనిచేసిన ఈ హీరోయిన్, అజయ్‌ దేవ్‌గన్‌తో ‘హిమ్మత్‌వాలా’లో కూడా నటించింది?
ఎ) రాశీ ఖన్నా    బి) లావణ్య త్రిపాఠి       సి) తమన్నా భాటియా       డి) శ్రియ శరన్‌

► హీరో నాగచైతన్య ట్విట్టర్‌ ఐడీ ఏంటో కనుక్కోండి?
ఎ) ఐయామ్‌ చే      బి) అక్కినేని చైతన్య  సి) చే అండర్‌స్కోర్‌ అక్కినేని     డి) దిస్‌ ఈజ్‌ చే

► శ్రీ విష్ణు నటించిన ‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రంతో ఓ దర్శకుడు నటుడయ్యారు, ఆయన పేరేంటో తెలుసా?
ఎ) దేవి ప్రసాద్‌   బి) పరశురామ్‌   సి) కోన వెంకట్‌  డి) తరుణ్‌ భాస్కర్‌

► సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం పేరు ‘మహానటి’. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో నటించిన నటి పేరేంటి?
ఎ) సమంత   బి) కీర్తీ సురేష్‌   సి) నిత్యామీనన్‌    డి) అనుష్క

► దర్శకుడు శ్రీను వైట్ల భార్య కూడా సినీ రంగంలోని ఓ విభాగంలో పని చేస్తున్నారు. అమె పని చేస్తున్న విభాగం పేరేంటి?
ఎ) ఫ్యాషన్‌ డిజైనర్‌   బి) ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌   సి) ప్రొడక్షన్‌ డిపార్ట్‌మెంట్‌    డి) ఎడిటింగ్‌

► ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది..’ అనే పాట రచయిత ఎవరు?
ఎ) వరికుప్పల యాదగిరి   బి) మాస్టర్జీ సి) కేదారేశ్వర్‌     డి) సిరివెన్నెల సీతారామశాస్త్రి

► ‘లైఫ్‌లో ఎపుడైనా ఏమైనా జరగొచ్చు, అది జరిగినప్పుడు దాన్ని మనం ఫేస్‌ చెయ్యటానికి సిద్ధంగా ఉన్నామా.. లేదా అన్నదే ముఖ్యం’.. ఈ డైలాగ్‌ చెప్పింది హీరో నాగచైతన్య. ఇది ఏ సినిమాలోని డైలాగో చెప్పుకోండి?
ఎ) యుద్ధం శరణం     బి) బెజవాడ      సి) ఆటోనగర్‌ సూర్య       డి) సాహసం శ్వాసగా సాగిపో

► అనుష్క నటించిన ‘భాగమతి’ సినిమాలోని బంగళా సెట్‌కి మంచి పేరొచ్చింది. ఆ బంగళాను డిజైన్‌ చేసిన ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎవరు?
ఎ) ఆనంద్‌ సాయి   బి) రవీందర్‌ రెడ్డి    సి) అశోక్‌ కుమార్‌   డి) బ్రహ్మ కడలి

► కార్తీక్, ముచ్చర్ల అరుణ నటించిన ఈ స్టిల్‌ ఏ సినిమాలోనిదో కనుక్కోండి?
ఎ) నాలుగు స్తంభాలాట   బి) రెండు రెళ్ల ఆరు    సి) సీతాకోక చిలుక  డి) స్వరకల్పన

► ఈ క్రింది ఫోటోలోని నటుడెవరో గుర్తు పట్టండి?
ఎ) రామ్‌   బి) శర్వానంద్‌    సి) నాగశౌర్య    డి) ప్రభాస్‌
 
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...   ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) డి 2) ఎ 3) ఎ 4)  సి 5) బి 6) సి 7) సి 8) ఎ 9) డి 10) ఎ 11) సి
12) సి 13) ఎ 14) బి 15) ఎ  16) డి 17) డి 18) బి  19) సి 20) ఎ

మరిన్ని వార్తలు