-

స్క్రీన్‌ టెస్ట్‌

8 Jun, 2018 01:56 IST|Sakshi

1. నటుడు విశాల్‌ హీరో కాకముందు  ఓ ప్రముఖ హీరో దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. ఎవరా హీరో?
ఎ) విక్రమ్‌   బి) అర్జున్‌  సి) భాగ్యరాజా   డి) విజయ్‌ కాంత్‌

2. నాని నటించిన ‘మజ్ను’ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోయిన్‌ ఎవరో కనుక్కోండి?
ఎ) అనూ ఇమ్మాన్యుయేల్‌  బి) అనుపమా పరమేశ్వరన్‌ సి) రుక్షార్‌ థిల్లన్‌ డి) నివేథా థామస్‌

3.   హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ‘కెరటం’ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు  పరిచయమయ్యారు. తనకు బ్రేక్‌ ఇచ్చిన సినిమా మాత్రం ‘వెంకటాద్రి  ఎక్స్‌ప్రెస్‌’. ఆ బ్రేక్‌ ఇచ్చిన దర్శకుడెవరు?
ఎ) గౌతమ్‌ పట్నాయక్‌    బి) సురేందర్‌ రెడ్డి  సి) మేర్లపాక గాంధీ          డి) సుబ్బారెడ్డి

4. ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని  పోలీసులకు దొరికిన బాలీవుడ్‌ నటుడెవరో కనుక్కోండి?
ఎ) ఆమిర్‌ ఖాన్‌   బి) సల్మాన్‌ ఖాన్‌    సి) సొహైల్‌ ఖాన్‌   డి) అర్భాజ్‌ ఖాన్‌

5. ‘నాలో ఊహలకు నాలో  ఊసులకు అడుగులు నేర్పావు’... అనే పాట ‘చందమామ’ సినిమాలోనిది.  ఈ పాట రచయితెవరో తెలుసా?
ఎ) రామజోగయ్య శాస్త్రి    బి) అనంత శ్రీరామ్‌  సి) చంద్రబోస్‌  డి) వనమాలి

6. ఎన్టీఆర్, అంజలీదేవి, జమున నటించిన ‘సతీ అనసూయ’   చిత్రానికి సంగీతదర్శకుడెవరో కనుక్కోండి?
ఎ) ఎస్‌.రాజేశ్వరరావు    బి) కె.వి. మహదేవన్‌   సి) ఘంటసాల   డి) పెండ్యాల

7. 2012వ సంవత్సరానికి ఫోర్బ్‌ ్స ఇండియా సెలబ్రిటీ టాప్‌ 100 లిస్టు్టలో 66వ స్థానాన్ని సంపాదించిన టాలీవుడ్‌ హీరో ఎవరై ఉంటారో ఓ లుక్కేయండి?
ఎ) ప్రభాస్‌ బి) జూనియర్‌ ఎన్టీఆర్‌ సి) అల్లు అర్జున్‌  డి) రామ్‌ చరణ్‌

8. అనురాగ్‌ బసు దర్శకత్వం వహించిన  బాలీవుడ్‌ చిత్రం ‘బర్ఫీ’ ద్వారా తెలుగు నుండి బాలీవుడ్‌కు షిఫ్ట్‌ అయిన హీరోయిన్‌ ఎవరో కనిపెట్టండి?
ఎ) ఇలియానా   బి) తమన్నా   సి) రకుల్‌ ప్రీత్‌సింగ్‌   డి) పూజా హెగ్డే

9. ఓ నాటకంలో నటించటానికి సావిత్రి దుగ్గిరాల వెళ్లినప్పుడు ఓ ఇంట్లో బస చేశారు. ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని ఆమె సినిమా ఇండస్ట్రీకి రమ్మన్నారు. ఆమె చెన్నై వెళ్లి, చాలా పెద్ద హీరోయిన్‌ అయ్యారు. ఎవరా హీరోయిన్‌?
ఎ) విజయనిర్మల    బి) అంజలీదేవి  సి) దేవిక  డి) జమున

10. జూన్‌ 10న హీరో బాలకృష్ణ పుట్టినరోజు. అదే రోజున మరో  అగ్ర దర్శకుని పుట్టినరోజు కూడా. ఎవరా దర్శకుడు?
ఎ) బి.గోపాల్‌ బి) శ్రీను వైట్ల   సి) ఈవీవీ సత్యనారాయణ   డి) జంధ్యాల

11. వెంకటేశ్‌ నటించిన ‘బొబ్బిలి రాజా’ చిత్ర సంగీత దర్శకుడెవరో తెలుసా?
ఎ) ఇళయ రాజా   బి) చక్రవర్తి    సి) యం.యం. కీరవాణి   డి) కోటి

12. ‘మదరాస పట్టణం’ సినిమా ద్వారా స్క్రీన్‌కి పరిచయమయ్యారీ భామ. ‘ఎవడు’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయమయ్యారు. ఎవరా హీరోయిన్‌?
ఎ) అమీ జాక్సన్‌ బి) అమలాపాల్‌       సి) ఆండ్రియా  డి) అంజలి

13. యోగా గురువు భరత్‌ ఠాగూర్‌ దగ్గర కొంత కాలం శిష్యరికం చేశారు  ఈ హీరోయిన్‌. ఎవరామె?
ఎ) భూమిక     బి) అనుష్క సి) చార్మీ        డి) ప్రియమణి

14. 1985లో విడుదలైన వందేమాతరం’ సినిమాలో  కథానాయకుడు ఎవరో చెప్పుకోండి చూద్దాం?
ఎ) భానుచందర్‌    బి) సుమన్‌  సి) రాజశేఖర్‌         డి) వినోద్‌కుమార్‌

15. విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్‌.నారాయణ మూర్తి తన మొదటి సినిమా నుండి  ఈ రోజు వరకు అలాంటి చిత్రాల్లోనే  నటించారు. ఆయన మొదటి  సినిమా ఏదో  చెప్పుకోండి?
ఎ) దండోరా  బి) అర్ధరాత్రి స్వతంత్రం  సి) అడవి దివిటీలు  డి) ఎర్ర సైన్యం

16. ఆ హీరో ఇప్పటివరకూ 15 సినిమాలు చేశారు. లవర్‌ బోయ్‌ ఇమేజ్‌ ఉన్న ఆ హీరో ఎవరు?
ఎ) రామ్‌     బి) నాని  సి) తరుణ్‌   డి) మనోజ్‌

17. ‘కబాలి, కాలా’ చిత్రాల దర్శకుడు పా.రంజిత్‌ గతంలో ‘మద్రాస్‌’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. అందులో నటించిన హీరో?
ఎ) కార్తీ    బి) సూర్య    సి) సిద్ధార్ధ్‌   డి) విశాల్‌

18.   బిగ్‌ బాస్‌ సీజన్‌ వన్‌ 70 రోజుల పాటు సాగింది. ఇప్పుడు మొదలయ్యే సీజన్‌ 2 షో ఎన్ని  రోజుల పాటు ఉంటుందో తెలుసా?
ఎ) 74 రోజులు  బి) 85 రోజులు  సి) 93 రోజులు  డి) 106 రోజులు

19.   ఈ ఫొటోలోని  చిన్నారిని గుర్తుపట్టండి?
ఎ) కంగనా రనౌత్‌   బి) కత్రినాకైఫ్‌  సి) స్నేహా ఉల్లాల్‌  డి) సోనమ్‌ కపూర్‌

20 . ఈ ఫొటోలో ఉన్నది ప్రముఖ దర్శక–నిర్మాత. ఆయనెవరో గుర్తుపట్టండి? (ఆయనో ప్రముఖ హీరో తండ్రి )
ఎ) అక్కినేని     బి) వీబీ రాజేంద్రప్రసాద్‌  సి) ఎన్టీఆర్‌      డి) డి. రామానాయుడు

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) బి 2) ఎ 3) సి 4) డి 5) బి 6) సి 7) బి 8) ఎ 9) డి 10) సి 11) ఎ
12) ఎ 13) బి 14) సి 15) బి 16) ఎ 17) ఎ 18) డి 19) బి 20) బి

నిర్వహణ: శివ మల్లాల

మరిన్ని వార్తలు