స్క్రీన్‌ టెస్ట్‌

6 Jul, 2018 01:34 IST|Sakshi

1. ఓ సినిమాలో మహేశ్‌బాబు కబడ్డీ ఆటగాడిగా కనిపించారు. ఏ చిత్రంలోనో గుర్తుందా?
ఎ) అతడు    బి) ఒక్కడు    సి) ఖలేజా   డి) నిజం

2. ‘నాయకి’ ద్విభాషా చిత్రంలో నటిగా, దెయ్యంగా రెండు పాత్రల్లో నటించిన నటి ఎవరో కనుక్కోండి?
ఎ) త్రిష      బి) సిమ్రాన్‌   సి) చార్మీ   డి) జ్యోతిక

3. ‘‘చిరు చిరు చిరు చినుకై కురిశావే, మరుక్షణమున మరుగైపోయావే’’... అనే పాట ‘ఆవారా’ చిత్రంలోనిది. హీరోగా కార్తీ నటించారు. హీరోయిన్‌?
ఎ) తమన్నా     బి) శ్రియ సరన్‌   సి) కాజల్‌ అగర్వాల్‌  డి) ప్రియమణి

4. ఇలియానా 2012లో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంలో హీరో రవితేజ సరసన నటించారు. ఆ చిత్రం తర్వాత మళ్లీ 2018లో ఆమె ఓ తెలుగు చిత్రం చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఎవరి సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారో తెలుసా?
ఎ) మహేశ్‌ బాబు   బి) అల్లు అర్జున్‌  సి) ప్రభాస్‌   డి) రవితేజ

5. ‘దేవదాసు’ చిత్రంతో హీరోగా పరిచయమైన రామ్‌ ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో హీరోగా నటించారో తెలుసా?
ఎ) 15 బి) 19 సి) 23 డి) 20

6. మహానేత వైయస్సార్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ చిత్రంలో టైటిల్‌ రోల్‌ చేస్తున్న నటుడెవరో తెలుసా?
ఎ) మమ్ముట్టి     బి) మోహన్‌లాల్‌   సి) విజయ్‌కాంత్‌  డి) శరత్‌కుమార్‌

7. ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి దగ్గర శిష్యరికం చేసిన ప్రఖ్యాత రచయితెవరో తెలుసా?
ఎ) అనంత శ్రీరామ్‌    బి) శ్రీమణి   సి) చంద్రబోస్‌   డి) రామజోగయ్య శాస్త్రి

8. నిర్మాత కె.యస్‌ రామారావు తన సొంత నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్‌లో చిరంజీవితో ఎన్ని సినిమాలు నిర్మించారో తెలుసా?
ఎ) 8   బి) 9   సి) 10  డి) 5

9. ‘ఇంద్ర’ సినిమాకి సంగీత దర్శకుడు మణిశర్మ. కానీ ఆ చిత్రంలోని ఓ సూపర్‌హిట్‌ సాంగ్‌ ‘అయ్యో అయ్యో అయ్యయ్యో.. చెలికాడు చంపేస్తున్నాడే’ అనే పాటకు సంగీత దర్శకుడు మాత్రం మణిశర్మ కాదు. మరి ఆ పాటకు సంగీత దర్శకుడెవ్వరో తెలుసా?
ఎ) దేవిశ్రీ ప్రసాద్‌   బి) ఆర్పీ పట్నాయక్‌   సి) ఇళయరాజా   డి) యం.యం. కీరవాణి

10. ఓ పక్క యన్టీఆర్‌తో, మరో పక్క మహేశ్‌ బాబు సరసన సినిమా చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బి) పూజా హెగ్డే సి) శ్రుతీహాసన్‌ డి) కాజల్‌ అగర్వాల్‌

11. ‘మల్లెల తీరంలో’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించిన తెలుగమ్మాయి ఎవరో తెలుసా?
ఎ) శ్రీదివ్య బి) అంజలి    సి) మాధవీలత డి) మధుశాలిని

12. పవన్‌కల్యాణ్‌ నటించిన ‘తమ్ముడు’ చిత్రం రీమేక్‌ను కన్నడలో శివరాజ్‌కుమార్‌ హీరోగా తెరకెక్కించిన తెలుగు దర్శకుడెవరో తెలుసా?
ఎ) శ్రీను వైట్ల   బి) వీవీ వినాయక్‌   సి) దశరథ్‌     డి) పూరి జగన్నాథ్‌

13. దర్శకుడు యస్‌.యస్‌. రాజమౌళి ట్వీటర్‌ ఐడీ ఏంటో?
ఎ) మీ రాజమౌళి   బి) యస్‌యస్‌ రాజమౌళి   సి) యువర్స్‌ రాజమౌళి   డి) రాజమౌళి సేస్‌

14. చిరంజీవి అల్లుడు హీరోగా పరిచయమవుతన్న చిత్రానికి కెమెరామెన్‌ ఎవరో కనుక్కోండి చూద్దాం?
ఎ) ఛోటా కె.నాయుడు   బి) కేకే సెంథిల్‌ కుమార్‌   సి) రత్నవేలు     డి) మది

15. జూలై 3న పుట్టిన ప్రముఖ నటుడెవరో గుర్తు తెచ్చుకోండి?
ఎ) కాంతారావు   బి) యస్వీ రంగారావు   సి) రామారావు డి) నాగేశ్వరరావు

16. ‘మనుషులు పుట్టాకే సంప్రదాయాలు పుట్టాయి. సంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు’ అనే డైలాగ్‌ ‘నువ్వు నాకు నచ్చావ్‌’ చిత్రం లోనిది. ఈ డైలాగ్‌ను ఏ ఆర్టిస్ట్‌ చెబుతారో తెలుసా?
ఎ) ప్రకాశ్‌రాజ్‌   బి) సుహాసిని  సి) వెంకటేశ్‌      డి) ఆర్తీ అగర్వాల్‌

17. ‘నేనే నానీనే నీ నానీని నేనే..’ అనే పాట రచయితెవరో తెలుసా?
ఎ) యం.యం. కీరవాణి   బి) శివశక్తి దత్తా  సి) రాజమౌళి   డి) కల్యాణ్‌ రమణ కోడూరి

18.  ‘అలా మొదలైంది’తో తన సినిమా దర్శక ప్రస్థానాన్ని ప్రారంభించిన దర్శకురాలు నందినీ రెడ్డి. ఆమె ప్రస్తుతం ఏ హీరోతో సినిమా చేయనున్నారో తెలుసా?
ఎ) నాని    బి) విజయ్‌ దేవరకొండ   సి) నాగశౌర్య   డి) అల్లు శిరీష్‌

19 ఈ క్రింది ఫొటోలోని బాలనటుడు ఓ పెద్ద హీరో. గుర్తుపట్టారా?
ఎ) కమల్‌హాసన్‌ బి) మహేశ్‌బాబు  సి) నాగార్జున     డి) ఎన్టీఆర్‌

20. ఎన్టీఆర్‌ నటించిన ఈ స్టిల్‌ ఏ సినిమాలోనిదో చెప్పుకోండి?
ఎ) శ్రీ కృష్ణావతారం  బి) శ్రీ కృష్ణ లీలలు  సి) మాయాబజార్‌ డి) శ్రీ కృష్ణ సత్య

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) బి  2) ఎ 3) ఎ  4) డి  5) ఎ 6) ఎ 7) డి 8) డి 9) బి 10) బి

11) ఎ 12) డి 13) బి 14) బి  15) బి 16) బి  17) ఎ 18) బి 19) ఎ  20) ఎ

నిర్వహణ: శివ మల్లాల

మరిన్ని వార్తలు