స్క్రీన్‌ టెస్ట్‌

13 Jul, 2018 01:19 IST|Sakshi

1. ఇప్పుడు మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ఓ సినిమాకు నిర్మాతలు సి.అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు. ఈ చిత్రానికి దర్శకుడెవరో తెలుసా?
ఎ) సుకుమార్‌  బి) వంశీ పైడిపల్లి   సి) త్రివిక్రమ్‌    డి) బోయపాటి శ్రీను

2. భారతదేశం గర్వించదగ్గ నిర్మాతల్లో ఏయం రత్నం ఒకరు. ఆయన ఏ హీరోయిన్‌కు మేకప్‌మేన్‌గా పని చేశారో తెలుసా?
ఎ) విజయశాంతి   బి) రాధిక   సి) రాధ    డి) శ్రీదేవి

3. ‘అందాల రాక్షసి’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన ఈ నటుడు ఇప్పుడు కెప్టెన్‌ కుర్చీలో కూర్చుని ‘చి.ల.సౌ’ అనే సినిమా ద్వారా దర్శకునిగా మారారు.     ఎవరతను?
ఎ) నవీన్‌ చంద్ర   బి) హను రాఘవపూడి   సి) రాహుల్‌ రవీంద్రన్‌   డి) అరుణ్‌ అదిత్‌

4. తమిళ దర్శకుడు బాలా దర్శకత్వంలో ‘నాచ్చియార్‌’ అనే చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఝాన్సీ’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఝాన్సీ పాత్రలో నటించిన నటి ఎవరో కనుక్కోండి?
ఎ) త్రిష       బి) జ్యోతిక   సి) శ్రియ     డి) అంజలి

5. ‘మృగం’ అనే డబ్బింగ్‌ చిత్రంలో నటించిన నటుడు ఇప్పుడు తెలుగులో మంచి ప్రామిసింగ్‌ ఆర్టిస్ట్‌. ఎవరు?
ఎ) ఆర్య       బి) భరత్‌   సి) శ్యామ్‌     డి) ఆది పినిశెట్టి

6. జయం, నిజం, వర్షం చిత్రాల విలన్‌గా నటించారీయన. ఈ హీరో నటించిన 25వ చిత్రం ఇటీవల విడుదలైంది. ఎవరా నటుడు?
ఎ) నితిన్‌       బి) గోపీచంద్‌   సి) రామ్‌       డి) తరుణ్‌
 
7. ‘బిVŠ  బాస్‌’ మొదటి సీజన్‌ విజేత శివబాలాజీ. ఆయన తన మొదటి సినిమాలో ఏ హీరోతో కలిసి పనిచేశారో తెలుసా?

ఎ) అల్లు అర్జున్‌    బి) నవదీప్‌   సి) ‘అల్లరి’ నరేశ్‌  డి) రవితేజ

8. నితిన్‌ హీరోగా నటిస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) రాశీ ఖన్నా  బి) ప్రణీత  సి) లావణ్యా త్రిపాఠి   డి) నివేథా థామస్‌

9 తమిళంలోనూ, తెలుగులోనూ ఈ ఆర్టిస్ట్‌ని ‘ఇతను మావాడంటే మావాడు’ అని ఓన్‌ చేసుకున్నారు. ఆ నటుడెవరో?
ఎ) ఎన్టీఆర్‌ బి) ఏయన్నార్‌  సి) యస్వీఆర్‌   డి) కాంతారావు

10. ‘వెన్నెల్లో ఆడపిల్ల’ నవలను రచించింది యండమూరి. ఆ నవల ఆధారంగా తీసిన చిత్రంలో హీరో ఎవరో గుర్తుందా?
ఎ) శ్రీకాంత్‌ బి) తరుణ్‌  సి) జేడీ చక్రవర్తి   డి) వడ్డే నవీన్‌

11. ‘సీతారాముల కల్యాణం చూతము రారండి’ అనే పాట ‘సీతారామ కల్యాణం’ చిత్రంలోనిది. ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించింది ఎవరో తెలుసా?
ఎ) ఘంటసాల   బి) కె.వి.మహదేవన్‌  సి) గాలి పెంచల నరసింహారావు  డి) సాలూరి రాజేశ్వరరావు

12. ‘ఛత్రపతి’ చిత్రంలో ‘గుండుసూది గుండుసూది’ అనే పాటకు స్వరాలు సమకూర్చి, గొంతు కలిపింది యం.యం.కీరవాణి. ఆయనతో పాటు గొంతు కలిపిన లేడీ సింగర్‌ ఎవరో ఓ సారి గుర్తుపడదామా?
ఎ) గీతామాధురి  బి) శ్రావణ భార్గవి సి) సునీత           డి) ప్రణవి

13. దర్శకుడు సుకుమార్‌ లెక్చరర్‌ అని చాలామందికి తెలుసు. ఆయన ఏ సబ్జెక్ట్‌ టీచ్‌ చేసేవారో తెలుసా?
ఎ) మ్యాథ్స్‌      బి) సోషల్‌   సి) తెలుగు      డి) ఇంగ్లీష్‌

14. రీసెంట్‌గా తనకు క్యాన్సర్‌ వ్యాధి వచ్చిందని సోషల్‌ మీడియా ద్వారా తెలియచేసిన నటి ఎవరు?
ఎ) మనీషా కోయిరాల   బి) సోనాలీ బింద్రే    సి) గౌతమి   డి) మమతా మోహన్‌దాస్‌

15. నాగచైతన్య నటిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో అల్లుడు నాగచైతన్య అయితే అత్తగా నటిస్తున్న నటి ఎవరో తెలుసా?
ఎ) భూమిక   బి) నదియా   సి) వాణీ విశ్వనాథ్‌  డి) రమ్యకృష్ణ

16. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇటీవల తన చిన్న కుమారునికి నామకరణం చేశారు. ఆ నందమూరి చిన్నారికి ఏ పేరు పెట్టారో తెలుసా?
ఎ) అభయ్‌ రామ్‌  బి) భార్గవ రామ్‌   సి) శౌర్య రామ్‌     డి) తారక్‌ రామ్‌

17. ప్రభాస్‌ నటిస్తున్న ‘సాహో’ చిత్రంలో ఓ హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ ‘శ్రద్ధాకపూర్‌’ నటిస్తున్నారు. మరో బాలీవుడ్‌ నటి కూడా నటిస్తున్నారు. ఎవరామె?
ఎ) ఎవెలిన్‌ శర్మ  బి) అనుష్కా శర్మ    సి) ఆలియా భట్‌ డి) దీపికా పదుకోన్‌

18. ‘మిణుగురులు’ చిత్రానికి దర్శకత్వం వహించి, పలు అవార్డులు అందుకున్న దర్శకుడు అయోధ్య కుమార్‌. ఆయన దర్శకత్వంలో ఇప్పుడు ‘24 కిసెస్‌’ అనే చిత్రం రానుంది. ఆ చిత్రంలో నటిస్తున్న హాట్‌ బ్యూటీ ఎవరో తెలుసా?
ఎ) కృతీ కర్భందా  బి) హెబ్బా పటేల్‌    సి) రష్మికా మండన్నా  డి) నందితా రాజ్‌

19. ఈ ఫోటోలోని ప్రముఖ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) షావుకారు జానకి    బి) అంజలీదేవి    సి) భానుమతి     డి) బి. సరోజాదేవి

20. ఈ కింది ఫోటోలో ముద్దుగా బొద్దుగా ఉన్న ఇప్పటి టాప్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరో కనుక్కోండి?
ఎ) ఆలియా భట్‌        బి) సన్నీ లీయోన్‌  సి) పరిణీతీ చోప్రా      డి) సోనాక్షీ సిన్హా

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) బి 2) ఎ 3) సి 4) బి 5) డి 6) బి 7) ఎ 8) ఎ 9) సి 10) ఎ
11) సి 12) సి 13) ఎ 14) బి 15) డి 16) బి 17) ఎ 18) బి 19) సి 20) ఎ

నిర్వహణ: శివ మల్లాల

మరిన్ని వార్తలు