స్క్రీన్‌ టెస్ట్‌

7 Sep, 2018 03:55 IST|Sakshi

1. నాని ఇప్పటివరకు ఎన్ని చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారో తెలుసా?
ఎ) 3 బి) 5 సి) 1 డి) 6

2. నాటి తరం హీరోలు కృష్ణ, కృష్ణంరాజులు ఎన్ని చిత్రాల్లో కలిసి నటించారో కనుక్కోండి?
ఎ) 12 బి) 21 సి) 9 డి) 15

3. మణిపాల్‌ యూనివర్సిటీలో జర్నలిజం పూర్తి చేసిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందామా?
ఎ) అనూ ఇమ్మన్యుయేల్‌  బి) నిత్యామీనన్‌ సి) నివేథా థామస్‌ డి) మంజిమా మోహన్‌

4. సౌత్‌లో చాలా సినిమాలు చేసి, నార్త్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న టబు హాలీవుడ్‌ సినిమాల్లోనూ నటించారు. ఆమె ఏ భాషలో మొదట హీరోయిన్‌గా నటించారో తెలుసా?
ఎ) తమిళ బి) ఇంగ్లీషు  సి) మలయాళం డి) తెలుగు

5. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘అలా మొదలైంది’ చిత్రసంగీత దర్శకుడెవరో తెలుసా?
ఎ) యం.యం.కీరవాణి  బి) కల్యాణి మాలిక్‌  సి) సాయికార్తీక్‌  డి) శేఖర్‌ చంద్ర

6. ‘చెల్లుబోయిన చిట్టిబాబు’ అనే పేరుతో నటించి 2018 బ్లాక్‌బస్టర్‌ మూవీస్‌లో నిలిచిన ఈ హీరో ఎవరో తెలుసా? (సి)
ఎ) విజయ్‌ దేవరకొండ  బి) నాని  సి) రామ్‌చరణ్‌ డి) అల్లు అర్జున్‌

7. ‘బాహుబలి’ చిత్రంలో అస్లాం ఖాన్‌ పాత్రను పోషించిన నటుడెవరో కనుక్కోండి?
ఎ) నాజర్‌ బి) సుదీప్‌ సి) ప్రభాకర్‌  డి) సుబ్బరాజు

8. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘మేఘ సందేశం’ చిత్రంలో ఓ సింగర్‌ తన  నిజమైన పేరుతోనే ఓ పాత్ర చేశారు. ఎవరా సింగర్‌?
ఎ) యస్పీ బాలసుబ్రమణ్యం  బి) కె.జే.ఏసుదాస్‌  సి) మను  డి) మంగళంపల్లి బాలమురళీ కృష్ణ

9 మేడమ్‌ స్పీకర్‌ అని ‘భరత్‌ అనే నేను’ సినిమాలో మహేశ్‌బాబు ఏ ఆర్టిస్ట్‌ను ఉద్దేశించి సంబోధిస్తారో తెలుసా?
ఎ) జయలలిత బి) అపూర్వ సి) రజిత డి) ప్రియా

10. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో హెచ్‌.ఎమ్‌. రెడ్డి పాత్రలో నటిస్తున్న ప్రముఖ నటుడెవరో తెలుసా?
ఎ) కైకాల సత్యనారాయణ బి) జయప్రకాశ్‌ రెడ్డి సి) కోట శ్రీనివాసరావు డి) నరేశ్‌

11. ‘పేపర్‌బాయ్‌’ చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన నటి పేరు ఏంటి?
ఎ) ప్రియ వడ్లమాని  బి) రియా సుమన్‌ సి) నందితా శ్వేతా డి) నభా నటేశ్‌

12. ‘ఎక్స్‌క్యూజ్‌మి మిస్టర్‌ మల్లన్న... ఒక కాఫీ తాగుదాం ఆవోనా...’ పాట ‘మల్లన్న’ చిత్రం లోనిది. ఈ పాటలో ‘మల్లన్న’ పాత్రధారి విక్రమ్‌ను ఆట పట్టించిన కథానాయిక ఎవరో గుర్తుందా?
ఎ) సదా   బి) సమంత   సి) శ్రియ  డి) సంగీత

13. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో ఫేమస్‌ అయిన హీరో పేరేంటో తెలుసా?
ఎ) ప్రిన్స్‌  బి) కార్తికేయ  సి) నందు  డి) వైభవ్‌

14. శ్రీ అమ్మయంగార్‌ అయ్యప్పన్‌ ఈ ప్రముఖ నటి అసలు పేరు. ఎవరామె?
ఎ) సుజాత  బి) సుహాసిని  సి) రాధిక   డి) శ్రీదేవి

15. ‘బాహుబలి’ చిత్రంలో హీరో ప్రభాస్‌కు అమ్మగా నటించారు రమ్యకృష్ణ. ఇప్పుడు మరో హీరోకు అత్తగా ఆమె నటించిన ఓ సినిమా రిలీజ్‌కి రెడీ అయింది. ఆ హీరో ఎవరు?
ఎ) అఖిల్‌  బి) మంచు విష్ణు  సి) నాగచైతన్య డి) ఆది

16. ‘అనుకోకుండా ఒక రోజు’ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి?
ఎ) చంద్ర సిద్ధార్థ  బి) చంద్రశేఖర్‌ యేలేటి  సి) చందు మొండేటి  డి) శేఖర్‌ కమ్ముల

17. ‘మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’ (మా) ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?
ఎ) రాజేంద్ర ప్రసాద్‌   బి) నరేశ్‌   సి) శివాజీ రాజా  డి) శ్రీకాంత్‌

18. బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ ‘రాజీ’లో నటించిన హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) శ్రద్ధా కపూర్‌  బి) కరీనా కపూర్‌  సి) సోనమ్‌ కపూర్‌  డి) ఆలియా భట్‌

19. ఈ ఫొటోలోని ప్రముఖ నటుడెవరో కనిపెట్టండి?
ఎ) చిత్తూరు వి .నాగయ్య  బి) యస్వీ రంగారావు    సి) కాంతారావు డి) ముక్కామల

20. ఈ ఫొటోలోని బాల నటుడు ఇప్పుడొక పెద్ద నటుడు చెప్పగలరా?
ఎ) మంచు మనోజ్‌  బి) అఖిల్‌ సి) ఆది   డి) మహేశ్‌బాబు

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) ఎ 2) బి 3) బి 4) డి5) బి 6) సి 7) బి 8) డి 9) ఎ 10) ఎ 11) బి
12) సి 13) బి 14) డి 15) సి 16) బి 17) సి 18) డి 19) బి  20) ఎ

నిర్వహణ: శివ మల్లాల

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా