స్క్రీన్‌ టెస్ట్‌

21 Sep, 2018 02:31 IST|Sakshi

1. ‘భలే భలే మగాడివోయ్‌ బంగారు నా సామిరోయ్‌...’ ఈ సూపర్‌ హిట్‌ పాటలో నటించిన హీరోయిన్‌ ఎవరు?
ఎ) జయసుధ బి) సరిత  సి) మాధవి డి) జయచిత్ర

2. అఖిల్‌ నటిస్తున్న మూడో చిత్రానికి దర్శకుడెవరు?
ఎ) విక్రమ్‌.కె. కుమార్‌   బి) వెంకీ కుడుముల   సి) శ్రీకాంత్‌ అడ్డాల డి) వెంకీ అట్లూరి

3.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నటిస్తున్న మరో హీరో ఎవరో తెలుసా?
ఎ) ‘అల్లరి’ నరేశ్‌ బి) నవీన్‌ చంద్ర   సి) ఆర్యన్‌ రాజేశ్‌ డి) రాహుల్‌ రవీంద్రన్‌

4. క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండను సిల్వర్‌ స్క్రీన్‌కు పరిచయం చేసిన దర్శకుడెవరు?
ఎ) రవిబాబు   బి) శేఖర్‌ కమ్ముల  సి) నాగ్‌ అశ్విన్‌    డి) తరుణ్‌ భాస్కర్‌

5 నాగార్జున, నాని నటిస్తున్న చిత్రం ‘దేవదాస్‌’. వైజయంతీ మూవీస్‌కి ఇది ఎన్నో చిత్రం ?
ఎ) 42 బి) 52 సి) 48 డి) 54

6. ఇటీవల విడుదలై విజయం సాధించిన చిత్రం ‘కేరాఫ్‌ కంచరపాలెం’. ఆ చిత్రదర్శకుడెవరు?
ఎ) రాహుల్‌ రవీంద్రన్‌ బి) పవన్‌ కుమార్‌  సి) రవికాంత్‌ పేరేపు డి) వెంకటేశ్‌ మహా

7. ‘బిగ్‌ బాస్‌’ సీజన్‌ 1’లో మంచి పేరు సంపాదించుకున్నారు హరితేజ. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన  ఏ సినిమాలో ఆమె కామెడీ పాత్రలో నటించారో తెలుసా?
ఎ) అఆ      బి) సన్నాఫ్‌ సత్యమూర్తి   సి) జులాయి డి) అత్తారింటికి దారేది

8. ‘మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది...’ ఈ పాటలో నటించిన ప్రముఖ నటి ఎవరు?
ఎ) భూమికా చావ్లా బి) సిమ్రాన్‌  సి) లయ డి) రమ్యకృష్ణ

9. తెలుగులో విశాల్‌ హీరోగా విడుదలైన మొదటి డబ్బింగ్‌ సినిమా పేరేంటో తెలుసా?
ఎ) పందెం కోడి బి) ప్రేమ చదరంగం సి) భరణి డి) భయ్యా

1.0 ప్రభాస్‌ హీరోగా నటించిన చిత్రం ‘బిల్లా’. ఆ చిత్రంలో  అనుష్క ఓ హీరోయిన్‌గా నటించారు. అనుష్కతో పాటు మరో బ్యూటీ కూడా హీరోయిన్‌గా నటించారు. ఆవిడ ఎవరు?
ఎ) కాజల్‌ అగర్వాల్‌  బి) త్రిష  సి) ప్రియమణి డి) నమిత

11. ‘అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు...’ రజనీకాంత్‌ చెప్పే ఈ డైలాగ్‌ ఏ సినిమాలోదో కనుక్కోండి?
ఎ) అరుణాచలం బి) భాషా  సి) నర సింహా డి) కథానాయకుడు

12 .దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ పరిచయం చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సౌత్‌లో టాప్‌ హీరోయిన్‌. ఎవరామె?
ఎ) సమంత బి) తమన్నా  సి) నయనతార   డి) శ్రియ

13. ‘సెకండ్‌ షో’ ఆ హీరోకి మొదటి మలయాళ సినిమా. ఈ మలయాళ నటుడు తెలుగు వారికీ  సుపరిచితుడు. ఎవరతను?
ఎ) మమ్ముట్టి బి) మోహన్‌లాల్‌  సి) దుల్కర్‌ సల్మాన్‌ డి) సురేశ్‌ గోపి

14. ‘మల్లెçపువ్వు’ చిత్రానికి సంగీత దర్శకుడెవరో తెలుసా? ఇది 2008లో విడుదలైన ‘మల్లెపువ్వు’.
ఎ) ఇళయరాజా బి) కోటి  సి) చక్రవర్తి  డి) అనూప్‌ రూబెన్స్‌

15. ఇటీవల స్వర్గస్తురాలైన దర్శకురాలు జయ ఎన్ని చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారో తెలుసా?
ఎ) 4 బి) 3 సి) 5 డి) 6

16. ‘చలి చలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది. నీ వైపే మళ్లింది మనసు’.. పాట ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ సినిమా లోనిది. ఆ పాట పాడిన గాయని ఎవరు?
ఎ) చిన్మయ్‌ బి) శ్రేయా గోషల్‌  సి) సుచిత్ర డి) చిత్ర

17. తమిళ సినిమా ‘పేటై్ట’లో నటిస్తున్న హీరో ఎవరో కనుక్కోండి? (చిన్న క్లూ: ఈ సినిమాకు దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు)
ఎ) కమల్‌హాసన్‌   బి) శరత్‌ కుమార్‌  సి) రజనీకాంత్‌ డి) విజయ్‌

18. సెప్టెంబర్‌ 20న ఈ ప్రముఖ నటుని పుట్టినరోజు. ఎవరా నటుడు?
ఎ) ఎన్టీఆర్‌ బి) అక్కినేని సి) కృష్ణ డి) కృష్ణంరాజు

19. ఈ ఫొటోలోని బుడతడు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్‌ హీరో. ఎవరై ఉంటారబ్బా?
ఎ) అల్లు అర్జున్‌  బి) ఎన్టీఆర్‌ సి) రామ్‌ చరణ్‌   డి) మహేశ్‌ బాబు

20. కింది ఫొటోలోని ప్రముఖ నటుడెవరో కనుక్కోండి?
ఎ) చలం బి) పధ్మనాభం  సి) నగేశ్‌ డి) రాజనాల

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు: 1) బి 2) డి 3) ఎ 4) ఎ 5) బి 6) డి 7) ఎ 8) ఎ 9) బి 10) డి
11) సి 12) ఎ 13) సి 14) ఎ 15) డి 16) బి 17) సి 18) బి 19) బి 20) సి

నిర్వహణ: శివ మల్లాల

మరిన్ని వార్తలు