స్క్రీన్‌ టెస్ట్‌

9 Nov, 2018 06:01 IST|Sakshi

అంతకుముందు ఆ తరువాత

‘స్టార్స్‌ లైఫ్‌’ ఎప్పుడూ ఆసక్తిగా ఉంటుంది. అసలు వాళ్లు స్టార్స్‌ కాకముందు ఏం చేసేవారో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా చాలా ఉంటుంది. కొందరు స్టార్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. నేను హీరో కాకముందు చేపల చెరువుల వ్యాపారం చేసేవాణ్ణి. ప్రతి సంవత్సరం నష్టాలే తప్ప ఒక్కసారి కూడా లాభం రాలేదు. ఆ తర్వాత హీరో అయ్యాను అని చెప్పే ప్రముఖ హీరో ఎవరో తెలుసా?
ఎ) ్రçపభాస్‌     బి) కృష్ణంరాజు     సి) చిరంజీవి     డి) గోపీచంద్‌

2. హీరో కాకముందు ఆయన వైజాగ్‌లో షూమార్ట్‌ నడిపేవారు.     ఆ బిజినెస్‌ నష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేయాలో తోచక ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించారు. తర్వాత హీరో అయ్యారు. ఎవరా హీరో?
ఎ) జె.డి. చక్రవర్తి   బి) జగపతిబాబు సి) వెంకటేశ్‌      డి) శ్రీకాంత్‌


3. ఇప్పుడామె ప్రపంచమంతటికీ హీరోయిన్‌గా తెలుసు. కానీ ఒకప్పుడు కెమెరా అసిస్టెంట్‌. ఎవరా హీరోయిన్‌?
ఎ) స్నేహ     బి) విజయశాంతి సి) రాధిక   డి) సుహాసిని

4 జర్నలిస్ట్‌ అవుదామని జర్నలిజమ్‌ చదువుకుంది. అయితే తన ఐడియాలను జర్నలిజమ్‌ ద్వారా చెప్పలేనని పుణే ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో సినిమాటోగ్రఫీ చేద్దామని వెళ్లినప్పుడు ఓ డైరెక్టర్‌ పరిచయం అయ్యి, నువ్వు యాక్ట్‌ చే స్తే బావుంటుంది అనటంతో మనసు మార్చుకుని హీరోయిన్‌ అయ్యింది. ఎవరా హీరోయిన్‌ తెలుసా?
ఎ) రాధికా ఆప్టే    బి) నిత్యా మీనన్‌ సి) మాళవికా అయ్యర్‌ డి) మాళవికా నాయర్‌

5. నాని హీరో కాకముందు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారని అందరికీ తెలుసు. కానీ అంతకుముందు మరో శాఖలో కూడా పని చేశారు. ఆయన గతంలో ఏ శాఖలో పని చేశారో తెలుసా?
ఎ) సినిమాటోగ్రఫీ   బి) డబ్బింగ్‌ సి) రేడియో జాకీ   డి) సింగర్‌

6. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘భద్ర’ చిత్రానికి కథారచయితగా చేసిన అతను ఇప్పుడు తెలుగు చిత్రసీమలో ప్రామిసింగ్‌ డైరెక్టర్‌. ఆ టాలీవుడ్‌ ప్రామిసింగ్‌ డైరెక్టర్‌ ఎవరబ్బా?
ఎ) వంశీ పైడిపల్లి బి) కొరటాల శివ సి) వక్కంతం వంశీ  డి) కల్యాణ్‌కృష్ణ

7. ఒక ఆడియోగ్రాఫర్‌గా సినీ పరిశ్రమలో జీవితం ప్రారంభించారు ఈయన. భారత దేశంలోని గొప్ప దర్శకుల్లో ఒకరుగా పేరు సంపాందించారు. ఎవరా దర్శకులు?
ఎ) కె.విశ్వనాథ్‌ బి) బాలచందర్‌    సి) మణిరత్నం డి) కె. రాఘవేంద్ర రావు

8 . మణిరత్నం దగ్గర దర్శకత్వ శాఖలో శిష్యరికం చేశారీయన . శంకర్‌ సినిమా ద్వారా నటునిగా పరిచయమయ్యారు. ఎవరా హీరో?
ఎ) సిద్ధార్థ్‌           బి) కార్తీ సి) మాధవన్‌      డి) అజిత్‌

9. అతనో సింగర్‌. సినిమాల్లో పాటలు పాడక ముందు అనేక ఉద్యోగాలు చేశారు. ప్రస్తుతం ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నోవార్టిస్‌లో ప్రాజెక్ట్‌ హెడ్‌గా పనిచేస్తున్న సింగర్‌ ఎవరో కనుక్కోండి?
ఎ) శ్రీకృష్ణ     బి) కారుణ్య సి) సింహా     డి) హేమచంద్ర

10. యస్‌.యస్‌ తమన్‌ సంగీత దర్శకునిగా స్థిరపడక ముందు ఓ సినిమాలో లీడ్‌ క్యారెక్టర్‌లో నటించి, నటునిగా మంచి మార్కులే సంపాదించాడు. అతను నటునిగా చేసిన చిత్రానికి దర్శకుడెవరో తెలుసా?
ఎ) శంకర్‌ బి) యన్‌.శంకర్‌ సి) జయ శంకర్‌   డి) హరీశ్‌ శంకర్‌


11. కోటగిరి వెంకటేశ్వరావు చిత్ర పరిశ్రమలో చాలా పేరున్న ఎడిటర్‌. ఆయన దగ్గర ఎడిటింగ్‌ శాఖలో శిక్షణ పొందిన దర్శకుడెవరో తెలుసా?
ఎ) వీవీ వినాయక్‌ బి) చంద్రశేఖర్‌ యేలేటి సి) శ్రీను వైట్ల డి) యస్‌.యస్‌. రాజమౌళి

12. నిర్మాతగా సినీరంగంలోకి అడుగుపెట్టారు ఈయన. తర్వాత కాలంలో రచయితగా బ్లాక్‌ బాస్టర్‌ విజయాలను సొంతం చేసుకున్నారు. ఎవరాయన?
ఎ) గోపీమోహన్‌ బి) కోన వెంకట్‌ సి) అబ్బూరి రవి డి) సతీశ్‌ వేగేశ్న

13. హీరో అర్జున్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన ప్రముఖ హీరో ఎవరో తెలుసా?
ఎ) విజయ్‌      బి) విశాల్‌  సి) ధనుశ్‌       డి) శివకార్తికేయన్‌

14 హీరో అవ్వకముందు ఆయన రోజూ 80 కిలోమీటర్లు బైక్‌పై వెళ్లి 1800 రూపాయల జీతానికి బట్టలు తయారుచేసే కంపెనీలో పని చేసిన హీరో ఎవరో తెలుసా?
ఎ) అల్లు అర్జున్‌      బి) విక్రమ్‌   సి) సూర్య             డి) శింబు

15. భక్తవత్సలం నాయుడు సిల్వర్‌ స్క్రీన్‌ కోసం మోహన్‌బాబుగా మారక ముందు ఏం చేసేవారో తెలుసా?
ఎ) డ్రిల్‌ మాస్టర్‌ బి) మ్యాథ్స్‌ టీచర్‌  సి) లెక్చరర్‌ డి) ఆర్టీసీ కండక్టర్‌

16. ప్రస్తుతం క్యారెక్టర్‌ నటుడుగా బిజీగా ఉన్న కాశీ విశ్వనాథ్‌ గతంలో దర్శకుడు. ఆయన ఏ సంస్థ ద్వారా దర్శకునిగా పరిచయమయ్యారు?
ఎ) సురేశ్‌ ప్రొడక్షన్స్‌   బి) వైజయంతి మూవీస్‌ సి) గీతా ఆర్ట్స్‌ డి) అన్నపూర్ణ పిక్చర్స్‌

17. దాసరి నారాయణరావు దర్శకులు కాకముందు రైటర్‌గా పనిచేశారు. అంతకంటే ముందు ఆయన ఏం పనిచేసేవారో తెలుసా?
ఎ) బ్యాంక్‌ ఉద్యోగి బి) నాటక రచయిత సి) పోస్ట్‌ మాస్టర్‌ డి) రైల్వే ఎంప్లాయి

18. నటుడు కాకముందు ఫైర్‌ మ్యాన్‌గా పనిచేసిన ఆ నటుడెవరు?
ఎ) యస్వీ రంగారావు బి) గుమ్మడి సి) రాజనాల    డి) కాంతారావు

19 . గౌతమ్‌ మీనన్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన ఇప్పటి హీరో ఎవరో తెలుసా?
ఎ) ఆది పినిశెట్టి    బి) సందీప్‌ కిషన్‌ సి) తనీష్‌æ       డి) ప్రిన్స్‌

20. హీరో కాకముందు బ్యాడ్మింటన్‌ క్రీడలో పుల్లెల గోపీచంద్‌తో కలిసి భారతదేశం తరఫున ఎన్నో టోర్నమెంట్స్‌లో పాల్గొన్న ఆ నటుడెవరో కనుక్కోండి?
ఎ) సుధీర్‌బాబు బి) నవీన్‌చంద్ర సి) రాహుల్‌ రవీంద్రన్‌ డి) అఖిల్‌

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) ఎ 2) బి 3) డి 4) బి 5) సి 6) బి 7) ఎ 8) ఎ 9) సి 10) ఎ 11) డి
12) బి 13) బి 14) సి 1 5) ఎ 16) ఎ 17) బి 18) ఎ 19) బి 20) ఎ

నిర్వహణ: శివ మల్లాల

మరిన్ని వార్తలు