స్క్రీన్‌ టెస్ట్‌

16 Nov, 2018 05:29 IST|Sakshi

అక్కడ ఇక్కడ.. సినిమాకి నో బౌండరీస్‌. ఇక్కడ హిట్టయిన సినిమా అక్కడ... అక్కడ హిట్టయిన సినిమా ఇక్కడ రీమేక్‌ అవుతుంటాయి. అలాంటి రీమేక్‌ మూవీస్‌ గురించి ఈ వారం స్పెషల్‌.

1. హిందీ చిత్రం ‘మిలీ’ తెలుగు ‘జ్యోతి’ చిత్రానికి మాతృక. అక్కడ (బాలీవుడ్‌లో) జయభాదురీ టైటిల్‌ రోల్‌ చేశారు. ఇక్కడ (టాలీవుడ్‌) ఆ పాత్రను పోషించిన నటి ఎవరు?
ఎ) జయసుధ     బి) జయప్రద  సి) శ్రీదేవి          డి) సుజాత

2. యన్టీఆర్‌ నటించిన ‘యుగంధర్‌’ సినిమా హిందీ ‘డాన్‌’కి రీమేక్‌. ఆ చిత్రంలో హీరోగా నటించిందెవరో గుర్తుందా?
ఎ) జితేంద్ర                బి) రిషికపూర్‌   సి) మిథున్‌ చక్రవర్తి  డి) అమితాబ్‌

3. తమిళ సూపర్‌ డూపర్‌ హిట్‌ ‘నాట్టామై’ తెలుగులో ‘పెదరాయుడు’గా విడుదలై, ఇక్కడా బంపర్‌ హిట్‌ సాధించింది. తెలుగులో మోహన్‌బాబు నటించారు. తమిళ్‌లో మోహన్‌బాబు పాత్రను పోషించిన నటుడెవరో తెలుసా?
ఎ) విజయ్‌కాంత్‌     బి) పార్తిబన్‌  సి) శరత్‌కుమార్‌     డి) రజనీకాంత్‌

4. విజయశాంతి హిందీలో చేసిన మొదటి చిత్రం ‘ఈశ్వర్‌’. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘స్వాతిముత్యం’ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ చిత్ర దర్శకుడెవరో కనుక్కోండి?
ఎ) కె.విశ్వనాథ్‌ బి) బి.గోపాల్‌  సి) కె. రాఘవేంద్రరావు  డి) కె. మురళీమోహన రావు

5. అక్కినేని నాగేశ్వరరావు హిందీలో ఒకే ఒక్క సినిమాలో నటించారు. తెలుగులో ఆయన నటించిన ఓ సూపర్‌ హిట్‌ చిత్రానికి రీమేక్‌ అది. ఆ చిత్రకథానాయిక అంజలీదేవి, ఆమె భర్త, చిత్రనిర్మాత ఆదినారాయణరావు మాటను కాదనలేక ఏయన్నార్‌ హిందీలో నటించారు. ఇంతకీ ఆ సినిమా పేరేంటి?
ఎ) దేవదాసు బి) సువర్ణసుందరి సి) కీలుగుర్రం  డి) తెనాలి రామకృష్ణ

6. హీరో రాజÔó ఖర్‌ను ఒకప్పుడు ‘అంకుశం’ రాజశేఖర్‌ అనేవారు. ఆ సినిమా ద్వారా ఆయనకు అంత పేరొచ్చింది. మరి... ఆ సినిమా రీమేక్‌ ద్వారా బాలీవుడ్‌కి హీరోగా పరిచయమైన తెలుగు నటుడెవరో తెలుసా?
ఎ) బాలకృష్ణ బి) వెంకటేశ్‌ సి) చిరంజీవి డి) నాగార్జున

7. ‘మిస్సమ్మ’ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ చేసిన పాత్రను తమిళ్‌లో చేసిన నటుడెవరు?
ఎ) యంజీఆర్‌ బి) శివాజీ గణేశన్‌  సి) జెమినీ గణేశన్‌  డి) శివకుమార్‌

8. కన్నడ చిత్రం ‘యు టర్న్‌’ తెలుగు రీమేక్‌లో సమంత జర్నలిస్ట్‌గా చేశారు. కన్నడ ‘యు టర్న్‌’లో ఆ పాత్ర చేసిన నటి ఎవరో కనుక్కోండి?
ఎ) ప్రియమణి  బి) రకుల్‌ ప్రీత్‌సింగ్‌  సి) అంజలి      డి) శ్రద్ధా శ్రీనాథ్‌

9. రజనీకాంత్‌ నటించిన ‘చంద్రముఖి’ అన్ని భాషల్లోనూ పెద్ద హిట్‌. ఆ సినిమా మొదట మలయాళంలో వచ్చింది. ‘చంద్రముఖి’ కన్నడ, తమిళ్, తెలుగు భాషలకు డైరెక్టర్‌ పి.వాసు. ఒరిజినల్‌  మలయాళ చిత్రానికి దర్శకుడెవరు?
ఎ) సురేశ్‌ కృష్ణ    బి) సిద్ధిక్‌ లాల్‌  సి) ఫాజిల్‌          డి) ప్రియదర్శన్‌

10 కృష్ణ, జయప్రద జంటగా నటించిన సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘ఊరికి మొనగాడు’. ఆ చిత్రాన్ని హిందీలో ‘హిమ్మత్‌వాలా’ పేరుతో విడుదల చేశారు. అది పెద్ద హిట్‌. జయప్రద రోల్‌ను పోషించిన నటి ఎవరు?
ఎ) రేఖ    బి) హేమ మాలిని  సి) శ్రీదేవి   డి) డింపుల్‌ కపాడియా

11. ‘ప్రేమమ్‌’ తెలుగు సినిమాలో లెక్చరర్‌ పాత్రలో నటించారు హీరోయిన్‌ శ్రుతీహాసన్‌. ఆ పాత్ర ఒరిజినల్‌ క్యారెక్టర్‌ను మలయాళంలో చేసిన నటి ఎవరో తెలుసా?
ఎ) సాయిపల్లవి  బి) మంజిమా మోహన్‌  సి) అనుపమా పరమేశ్వరన్‌  డి) నివేథా థామస్‌

12 మహేశ్‌ బాబు కెరీర్‌లో ‘పోకిరి’ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బాస్టర్‌. అదే పేరుతో ఆ సినిమాను తమిళ్‌లో తెరకెక్కించారు. అక్కడ కూడా ‘పోకిరి’ మంచి హిట్‌ను సొంతం చేసుకుంది. మహేశ్‌బాబు క్యారెక్టర్‌ను చేసిన ఆ తమిళ్‌ హీరో ఎవరు?
ఎ) అజిత్‌     బి) శివ కార్తికేయన్‌ సి) విజయ్‌   డి) సూర్య

13. ‘తుమ్హారి సులు’ అనే సినిమాను హిందీలో విద్యాబాలన్‌ చేశారు. తమిళ్‌లో ఆ సినిమా రీమేక్‌ ‘కాట్రిన్‌ మొళి’లో ఆ పాత్రను చేసిన నటి ఎవరో తెలుసా?
ఎ) శ్రుతీహాసన్‌   బి) జ్యోతిక  సి) నయనతార  డి) సమంత

14 నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఏ మాయ చేసావె’. ఆ చిత్రం తమిళ్‌ వెర్షన్‌లో సమంత పాత్రను పోషించిన నటి ఎవరో తెలుసా?
ఎ) శ్రియ            బి) త్రిష  సి) అమలాపాల్‌   డి) మీరా జాస్మిన్‌

15. సునీల్‌ హీరోగా నటించిన ‘మర్యాద రామన్న’ చిత్రం హిందీ రీమేక్‌లో ఆ పాత్రను పోషించిన నటుడెవరో తెలుసా?
ఎ) అజయ్‌ దేవగన్‌ బి) అక్షయ్‌ కుమార్‌ సి) సంజయ్‌దత్‌ డి) సైఫ్‌ అలీఖాన్‌

16. విద్యాబాలన్‌ చేసిన హిందీ ‘కహానీ’ తెలుగు రీమేక్‌ ‘అనామిక’లో నయనతార నాయికగా నటించారు. ‘అనామిక’ సంగీత దర్శకుడెవరో తెలుసా?
ఎ) మణిశర్మ బి) యం.యం.కీరవాణి సి) మిక్కీ జే మేయర్‌  డి) కె.యమ్‌ రాధాకృష్ణన్‌

17. వెంకటేశ్‌ హీరోగా తెలుగు ‘సూర్యవంశం’, అమితాబ్‌ బచ్చన్‌ హీరోగా హిందీ ‘సూర్యవంశ్‌’ చిత్రాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాలనూ తెరకెక్కించిన దర్శకుడెవరో కనుక్కోండి?
ఎ) ఈవీవీ సత్యనారాయణ  బి) దాసరి నారాయణరావు  సి) కోడి రామకృష్ణ డి) బి.గోపాల్‌

18. విజయ్‌ దేవరకొండ నటించిన ‘అర్జున్‌ రెడ్డి’ సంచలన విజయం సాధించింది. హీరోయిన్‌గా షాలినీ పాండే నటించారు. ఆ చిత్రాన్ని హిందీలో సేమ్‌ డైరెక్టర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ ‘అర్జున్‌ రెడ్డి’లో హీరోయిన్‌గా నటిస్తున్నది ఎవరో తెలుసా?
ఎ) కరీనా కపూర్‌ బి) కియరా అద్వాని సి) ఆలియా భట్‌  డి) ప్రియాంకా చోప్రా

19. తమిళ చిత్రం ‘వసంత మాళిగై’ అంటే తెలుగు ‘ప్రేమనగర్‌’. రెండు భాషల్లోనూ హీరోలు శివాజీ గణేశన్, అక్కినేని. కానీ హీరోయిన్‌ ఒక్కరే. ఎవరా హీరోయిన్‌?
ఎ) సావిత్రి     బి) వాణిశ్రీ  సి) జమున     డి) కాంచన

20. రీమేక్‌ చిత్రాలు చేయడానికి ఇష్టపడనని ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన శంకర్‌ ఓ హిందీ సినిమాని ‘నన్బన్‌’ పేరుతో తమిళంలో రీమేక్‌ చేశారు. ఇది ‘స్నేహితుడా’ పేరుతో తెలుగులో విడుదలైంది. హిందీలో కరీనా కపూర్‌ నాయిక.. మరి సౌత్‌లో ఎవరు?
ఎ) ఇలియానా బి) చార్మి  సి) కాజల్‌ అగర్వాల్‌ డి) శ్రియ

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) ఎ 2) డి 3) సి 4)ఎ 5) బి 6) సి 7) సి 8) డి 9) సి 10) సి 11) ఎ
12) సి 13) బి 14) బి 15) ఎ 16) బి 17) ఎ 18) బి 19) బి 20) ఎ

నిర్వహణ:  శివ మల్లాల

మరిన్ని వార్తలు