స్క్రీన్‌ టెస్ట్‌

25 Jan, 2019 06:08 IST|Sakshi

రిపబ్లిక్‌ డే స్పెషల్‌ క్విజ్‌

1. ‘ఈ జెండా పసిబోసి చిరునవ్వురా, దాస్య సంకెళ్లు తెంచిందిరా..’ అనే పాట మహేశ్‌బాబు నటించిన ఓ చిత్రంలోనిది. ఈ పాటలో ఓ పసిబాబు చేతిలో నుండి జాతీయ జెండా ఓ కొండపై నుండి కింద పడుతుంది. ఆ జెండా కింద పడకుండా హీరో పట్టుకునే ఈ సీన్‌ ఏ సినిమాలోనిది?
ఎ) బాబీ           బి) అతడు  సి) ఖలేజా        డి) ఒక్కడు

2. అక్కినేని, సావిత్రి జంటగా నటించిన చిత్రం ‘వెలుగు నీడలు’. ఈ చిత్రంలోని ‘పాడవోయి భారతీయుడా’ పాట  రచయితెవరో కనుక్కోండి?
ఎ) కొసరాజు   బి) ఆత్రేయ  సి) శ్రీశ్రీ          డి) సినారె

3. ‘తెలుగు వీర లేవరా, దీక్ష బూని సాగరా...’ అనే పాటలో నటించిన నటుడెవరో తెలుసా?
ఎ) శోభన్‌బాబు     బి) యన్టీఆర్‌     సి) అక్కినేని     డి) కృష్ణ

4. ‘జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాదపీ గరీయశీ...’ అనే పాట రచించింది, దర్వకత్వం వహించింది ఒక్కరే. ఎవరా దర్శకుడు?
ఎ) ముత్యాల సుబ్బయ్య  బి) దాసరి నారాయణరావు సి) రవిరాజా పినిశెట్టి   డి) కోడి రామకృష్ణ

5. ‘దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే...’ అనే పాటలో నటించిన నటుడెవరో తెలుసా? (చిన్న క్లూ: ఈ చిత్రానికి తేజ దర్శకుడు)
ఎ) ఉదయ్‌కిరణ్‌    బి) నవదీప్‌  సి) ప్రిన్స్‌                డి) దిలీప్‌ రెడ్డి

6. ‘కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరుకొక్క వీధి పేరు కాదురా గాంధీ...’ పాట శ్రీకాంత్‌ నటించిన 100వ చిత్రం ‘మహాత్మ’ లోనిది. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. ఈ దేశభక్తి గీతం సూపర్‌హిట్‌. ఈ పాటలో నటించిన క్యారెక్టర్‌ నటుని పేరేంటి ?
ఎ) రామ్‌జగన్‌   బి) తనికెళ్ల భరణి  సి) పరుచూరి గోపాలకృష్ణ  డి) అజయ్‌ ఘోష్‌

7. ‘మేజర్‌ చంద్రకాంత్‌’ చిత్రంలోని ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి... జన్మ భూమి నాదేశం సదా స్మరామి...’ అనే పాటలో యన్టీఆర్‌ నటించారు. ఆ పాటను రచించింది జాలాది. సంగీత దర్శకుడెవరో తెలుసా?
ఎ) మణిశర్మ బి) యంయం కీరవాణి సి) రాజ్‌–కోటి డి) చక్రవర్తి

8. ‘వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా’ పాట ఏ చిత్రంలోనిది? (మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకుడు).
ఎ) బొంబాయి   బి) రోజా  సి) దిల్‌సే          డి) దళపతి

9. ‘వందేమాతరం’ చిత్రంలోని ‘వందేమాతరం, వందేమాతరం... వందేమాతర గీతం వరస మారుతున్నది... తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది..’ అనే పాటతో శ్రీనివాస్‌ ఇంటి పేరు ‘వందేమాతరం’ అయింది. ఈ పాటలో నటించింది హీరో రాజశేఖర్, హీరోయిన్‌గా నటించింది ఎవరో తెలుసా?
ఎ) విజయశాంతి  బి) భానుప్రియ    సి) సుమలత        డి) జీవిత

10. ‘భారత మాతకు జేజేలు... బంగరు భూమికి జేజేలు’ పాట యన్టీఆర్‌ నటించిన ‘బడిపంతులు’ చిత్రంలోనిది. పీసీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యన్టీఆర్‌ మనవరాలిగా నటించిన బాల నటి ఎవరో కనుక్కోండి? (తర్వాత కాలంలో ఆమె యన్టీఆర్‌ సరసన హీరోయిన్‌గా నటించారు)
ఎ) విజయనిర్మల   బి) జయసుధ  సి) శ్రీదేవి             డి) జయంతి

11. ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా... పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలపరా నీ జాతి నిండు గౌరవమూ...’ పాట ‘అమెరికా అబ్బాయి’ సినిమాలోనిది. అమెరికాలో షూటింగ్‌ చేసుకున్న ఈ క్రాస్‌ ఓవర్‌ సినిమాకు దర్శకుడెవరు?
ఎ) బాలచందర్‌     బి) కె. విశ్వనాథ్‌  సి) సింగీతం శ్రీనివాసరావు   డి) భారతీరాజ

12. ‘ఓ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్లీ కావాలి...’ అనే పాట చిరంజీవి నటించిన ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ చిత్రంలోనిది. ఈ దేశభక్తి గీతాన్ని సుద్దాల అశోక్‌తేజ రచించగా దేవీశ్రీ ప్రసాద్‌ స్వరపరిచారు. ఈ చిత్రానికి దర్శకుడెవరు?
ఎ) బి. గోపాల్‌       బి) ప్రభుదేవా సి) జయంత్‌.సి. పరాన్జీ  డి) వీవీ వినాయక్‌

13. 1982లో విడుదలైన ‘గాంధీ’ చిత్రానికి రిచర్డ్‌ అటెన్‌బరో స్వీయదర్శకత్వం వహించారు. బెన్‌ కింగ్‌స్లే ‘గాంధీ’ పాత్రధారి. బ్రిటిష్‌ ఇండియన్‌ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కస్తూర్బా గాంధీ పాత్రలో నటించిన ప్రముఖ బాలీవుడ్‌ నటి ఎవరో కనుక్కోండి?
ఎ)     బి) రేఖ  సి) రోహిణి హట్టంగడి  డి) హేమమాలిని

14. ఆంగ్లేయుల వద్ద సిపాయిగా పనిచేసిన ‘మంగల్‌ పాండే’ పాత్రలో నటించారు ఆమిర్‌ఖాన్‌. ఆ చిత్రంలో ఆయన సరసన హీరా పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసుకుందామా?
ఎ) రాణీ ముఖర్జీ  బి) కరిష్మా కపూర్‌ సి) కరీనా కపూర్‌  డి) అమీషా పటేల్‌

15. ‘మేమే ఇండియన్స్‌ మేమే ఇండియన్స్‌...’ పాట ‘ఖడ్గం’ చిత్రంలోనిది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ముస్లిం పాత్రలో నటించి, మెప్పించిన నటుడెవరు?
ఎ) శ్రీకాంత్‌        బి) రవితేజ  సి) ప్రకాశ్‌రాజ్‌    డి) బ్రహ్మాజీ

16. ‘ఏ మేరా ఇండియా, ఐ లవ్‌ మై ఇండియా...’ పాట  సుభాష్‌ ఘాయ్‌ దర్శకత్వం వహించిన ‘పరదేశ్‌’ చిత్రంలోనిది. ఆ చిత్రంలో షారుఖ్‌ ఖాన్‌ సరసన నటించిన నటి ఎవరు?
ఎ) మహిమా చౌదరి బి) ప్రీతి జింటా  సి) కాజోల్‌  డి) కత్రినాకైఫ్‌

17. సంజయ్‌దత్, అజయ్‌ దేవ్‌గన్, సైఫ్‌ అలీఖాన్, అర్మాన్‌ కోహ్లి, సునీల్‌ శెట్టి, సంజయ్‌ కపూర్, అభిషేక్‌ బచ్చన్, అక్షయ్‌ఖన్నా.. ఇంతమంది బాలీవుడ్‌ హీరోలు నటించిన చిత్రం ‘ఎల్‌ఓసి కార్గిల్‌’. వారితో పాటు ఆ చిత్రంలో నటించిన తెలుగు హీరో ఎవరో తెలుసా?
ఎ) ప్రభాస్‌    బి) నాగార్జున  సి) రానా    డి) వెంకటేశ్‌

18. శంకర్‌ దర్శకత్వం వహించిన ‘భారతీయుడు’ చిత్రంలో స్వాతంత్య్ర సమర యోధుడు సేనాపతి పాత్రలో నటించారు కమల్‌హాసన్‌. మళ్లీ సేమ్‌ కాంబినేషన్‌లో ‘భారతీయుడు–2’ తెరకెక్కుతోంది. ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ సీక్వెల్‌ ప్రారంభించారో కనుక్కోండి?
ఎ) 22   బి) 18   సి) 20   డి) 25

19. తెల్లదొరలపై తిరగబడ్డ తెలుగుబిడ్డ ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన చరిత్రను సినిమా గా రూపుదిద్దిన నటుడెవరో తెలుసా? (అతనే నిర్మాత, దర్శకుడు, నటుడు)
ఎ) చంద్రమోహన్‌ బి) విజయ్‌ చందర్‌ సి) మురళీమోహన్‌    డి) నరేశ్‌

20. చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా’. ఆంగ్లేయులను ఎదిరించిన తెలుగువాడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర ఇది. ఈ చిత్రంలోని ‘మైరారెడ్డి’ పాత్రను పోషిస్తున్న నటుడెవరో తెలుసా?
ఎ) జగపతిబాబు    బి) సుదీప్‌  సి) అమితాబ్‌   డి) విజయ్‌ సేతుపతి

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) (ఎ) 2) (సి) 3) (డి) 4) (బి) 5) (బి) 6) (ఎ) 7) (బి) 8) (బి) 9) (ఎ) 10) (సి)
11) (సి)  12) (బి) 13) (సి) 14) (ఎ) 15) (సి) 16) (ఎ) 17) (బి) 18) (ఎ) 19) (బి) 20) (ఎ)

నిర్వహణ: శివ మల్లాల

మరిన్ని వార్తలు