ఓ ఇంటివాడు కాబోతున్న టాలీవుడ్ సంగీత దర్శకుడు!

13 Nov, 2013 18:45 IST|Sakshi
ఓ ఇంటివాడు కాబోతున్న టాలీవుడ్ సంగీత దర్శకుడు!
దర్శకుడు రవిబాబు చిత్రాలు నచ్చావులే, నువ్విలా, మనసారా, అనుసూయ, అమరావతి, అవును చిత్రాలకు సంగీతాన్ని అందించిన వర్ధమాన సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ఓ ఇంటివాడు కాబోతున్నారు. నవంబర్ 28 తేదిన మాధురితో శేఖర చంద్ర వివాహం నిశ్చయమైంది. డిసెంబర్ 1 తేదిన ఎన్ కన్వెన్షన్ (డైమండ్) రిసెప్షన్ జరుగుతుందని శేఖర్ వెల్లడించారు. 
 
ప్రస్తుతం నిఖిల్, స్వాతి నటిస్తున్న 'కార్తీకేయ', 'వీకెండ్ లవ్', నీలకంఠ 'మాయ', సాయిరాం శంకర్ 'దిల్లున్నోడు' చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు.