తలసానితో టాలీవుడ్ పెద్దలు భేటీ

29 Dec, 2014 11:27 IST|Sakshi

హైదరాబాద్ : తెలంగాణ వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో తెలుగు చిత్రపరిశ్రమ పెద్దలు సోమవారం భేటీ అయ్యారు. వారు ఈ సందర్భంగా  చిత్ర పరిశ్రమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. త్వరలో సినీ ప్రముఖలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి తలసానిని కలిసిన వారిలో కేఎస్ రామారావు, దగ్గుబాటి సురేష్ బాబు తదితరులు ఉన్నారు.