రారండోయ్‌పండగచేద్దాం!

15 Jan, 2018 02:06 IST|Sakshi

చిన్నా పెద్దా తేడా లేదు. అక్కడ, ఇక్కడ అన్న బేధాలు లేవు. కామన్‌ మేన్‌ అయినా సెలబ్రిటీ అయినా.. ఎవరైనా ఒకటే. అందరి ఆలోచనా ఒకటే. పండగ చేసుకోవాలి. ‘రారండోయ్‌ సంక్రాంతి పండగ చేద్దాం’  అంటూ, ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు చెబుతూసోషల్‌ మీడియాలో వారి ఫొటోలు పోస్ట్‌ చేశారు కొందరు నటీనటులు.

నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఛలో’. ‘‘ఈ నెల 25న జరగనున్న ‘ఛలో’ ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రావడానికి చిరంజీవిగారు  ఒప్పుకున్నారు. థ్యాంక్స్‌ సర్‌. భోగి రోజున నా ఆనందానికి అవధులు లేవు’’ అన్నారు నాగశౌర్య. ఈ  చిత్రాన్ని వచ్చే నెల 2న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

పండగ రోజు మా నాన్నగారితో  టైమ్‌ స్పెండ్‌ చేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు మంజుల.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి సెలబ్రేషన్‌లో భాగంగా రామ్‌చరణ్, నిహారిక, వైష్ణవ్‌ తేజ్‌లతో తాము ఉన్న గ్రూప్‌ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు సాయిధరమ్‌ తేజ్, వరుణ్‌ తేజ్‌.

అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ.. నివేథా థామస్, అనుపమా పరమేశ్వరన్,  రీతూ వర్మ తమ లేటెస్ట్‌ ఫొటోలను షేర్‌ చేశారు.

భోగి మంట సంబరాల్లో సంపూర్ణేష్‌ బాబు, హృదయ కాలేయం దర్శకుడు–కొబ్బరిమట్ట నిర్మాత సాయి రాజేష్‌.


ఆదివారం ఉదయం  జై సల్మీర్‌లో హిందీ చిత్రం  ‘అయ్యారీ’ టీమ్‌తో కలిసి భోగి పండగ వేడుకల్లో పాల్గొన్నారు హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు