టాలీవుడ్‌ తారల న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌

1 Jan, 2020 12:09 IST|Sakshi

దేశవ్యాప్తంగా న్యూ ఇయర్‌ సంబరాలు అంబరాన్నంటాయి. సరికొత్త ఆశలతో ప్రజలు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. డీజేలు, డ్యాన్సులు, కేక్‌ కట్టింగ్‌లు, పార్టీలతో హోరెత్తించారు. పలువురు తెలుగు సినీ ప్రముఖులు కూడా న్యూ ఇయర్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. అల్లు అర్జున్‌ బ్యాంకాక్‌లో, సుధీర్‌బాబు చిక్‌మంగళూరులో, అల్లరి నరేశ్‌ పోర్చుగల్‌లో సంబరాల్లో మునిగిపోయారు. మెగాఫ్యామిలీ నుంచి వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌, కళ్యాణ్‌దేవ్‌, అల్లు బాబీలు ఒకచోట చేరి న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకున్నారు.    

మరోవైపు పులవురు సినీ ప్రముఖలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు తెలిపారు. అందులోకొన్ని..

► నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, భోగ భాగ్యములను షిర్డీ సాయి నాధుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను- మోహన్‌బాబు

► 2019 ఏడాది ఎంతో అద్భుతంగా గడిచేలా.. ఆశీస్సులు అందించిన దేవుడికి ధన్యవాదాలు. నన్ను ప్రేమిస్తున్న నా కుటుంబానికి, నాతో ఎప్పుడూ నిలబడే నా స్నేహితులకు, ప్రేమాభిమానాలతో నన్ను ఎంతగానో సపోర్ట్‌ చేస్తూ.. మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికీ హ్యాపీ న్యూ ఇయర్‌- మహేశ్‌బాబు

► అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను - ఎన్టీఆర్‌

► కొత్త కలలు, కొత్త ఆశలు, కొత్త కోరికలు.. ప్రతి ఒక్కటి నెరవేరాలి. కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపాలని కోరుకుంటున్నాను- దిల్‌ రాజు

► ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు- ప్రభాస్‌

► జీవితంలో ఎన్నో ఎత్తు, పల్లాలు, మరెన్నో అనుభవాలు ఇచ్చిన దశాబ్దానికి గుడ్‌బై.నూతన సంవత్సర శుభాకాంక్షలు - అల్లరి నరేష్‌

► ఈ ఏడాది అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు చేకూరాలని కోరుకుంటున్నాను- రవితేజ

► హ్యాపీ న్యూ ఇయర్‌ మిత్రులందరికీ ఈ ఏడాదిలో అందరి జీవితాలు ఆనందం నిండాలని కోరుకుంటున్నాను - నాగార్జున

► హ్యాపీ న్యూ ఇయర్‌. ఈ ఏడాది అందరికీ అద్భుతంగా ఉండాలని కోరకుంటున్నాను. వేడుకలను జాగ్రత్తగా చేసుకోండి. సంతోషాన్ని పంచండి, ద్వేషాన్ని కాదు - మంచు మనోజ్‌

► హ్యాపీ న్యూ ఇయర్‌. ఈ ఏడాది అందరికీ అద్భుతంగా ఉండాలని కోరకుంటున్నాను - రష్మికా మందన్నా

► ప్రతి ఒక్కరికీ హ్యాపీ ఆర్‌ఆర్‌ఆర్‌ ఇయర్‌- ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌

► గతేడాది నా జీవితంలో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎన్నో విశేషాలను అందించింది. నాకు సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. 2020లో నేను ‘అశ్వథ్థామ’ చిత్రంతో మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమా అందర్నీ నచ్చుతుందని భావిస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్‌ - నాగశౌర్య

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా