పవన్‌ ఒక్కరికే ఫ్యాన్స్‌ ఉన్నారా..

16 Apr, 2018 17:57 IST|Sakshi
విలేకరుల సమావేశంలో అపూర్వ, శ్రీరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : సినీనటుడు పవన్‌ కల్యాణ్‌పై చేసిన ఆరోపణలకు మహిళా జూనియర్‌ ఆర్టిస్టులు క్షమాపణలు చెప్పారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలుగు సినీ రంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ’లపై మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌పై క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ శృతి తీవ్ర ఆరోపణలు చేశారు. రెండు వందల కోట్లతో అమరావతిలో ఇల్లు కడుతున్నారని, మసాజ్‌కు బెంగాళీ అమ్మాయిలు కావాలని, మహిళల సమస్యలను ఏమాత్రం పట్టించుకోరని పవన్‌పై ఘాటు విమర్శలు చేశారు.

సోమవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ.. పవన్‌ ఒక్కరికే అభిమానులు ఉన్నారా అంటూ ప్రశ్నించారు. ఫ్యాన్స్‌ను అదుపులో ఉంచుకోవాలంటూ సూచించారు. సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై పోరాడటానికి తాము ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నామని, అభిమానుల పేరుతో కొందరు బెదిరింపులకు దిగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానుల పేరుతో ఆడవాళ్ల జీవితాలతో ఆడుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌, కో ఆర్డినేటర్ల విధానాన్ని నిర్మూలించాలని, అప్పుడే మహిళా ఆర్టిస్టులకు తగిన న్యాయం జరుగుతుందన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

ఇంటి ప‌ని చేస్తూ ఏడ్చేసిన‌ న‌టి

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సినిమా

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

ఇంటి ప‌ని చేస్తూ ఏడ్చేసిన‌ న‌టి

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సింగ‌ర్‌కు ఐదోసారీ క‌రోనా పాజిటివ్‌