కూతురు భద్రత కోసం ట్రామ్ క్రూజ్ భారీగా ఖర్చు!

29 Jun, 2013 20:23 IST|Sakshi
కూతురు భద్రత కోసం ట్రామ్ క్రూజ్ భారీగా ఖర్చు!
తన కూతురు సూరి భద్రత కోసం హాలీవుడ్ టామ్ క్రూయిజ్ భారీగానే ఖర్చు పెడుతున్నారు. తన కూతురు ఎల్లావేళలా కాపాడేందుకు నియమించిన బాడీగార్డుల కోసం వారానికి 50 వేల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. తన మాజీ భార్య కేటీ హోల్మ్స్, సూరిలను వెంటాడుతున్న ఫోటో జర్నలిస్టుల నుంచి కాపాడేందుకు భారీగానే సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ట్రామ్ క్రూయిజ్ కు రక్షణగా రెండు అంచెల భద్రతా సిబ్బంది అనుక్షణం కాపలాగా ఉంటారు.
 
అయితే తన కూతురు కోసం తన కంటే రెండింతలు భద్రతా సిబ్బందిని నియమించారు. సూరి భద్రత కోసం డబ్బు ప్రధానం కాదని.. రక్షణే ముఖ్యమని టామ్ భావిస్తున్నారు. సూరి భద్రత కోసం ఏర్పాటు చేసిన భద్రతా సిబ్బంది అధునిక శిక్షణ పొందినట్టు.. అనుమతి పొందిన ఆయుధాలను కలిగి ఉంటారని.. ఎల్లా వేళలా ఆయుధాలతో రక్షణగా ఉంటారు.
 
సూరి భద్రతపై క్రూయిజ్ చూపుతున్న శ్రద్దపై హోల్మ్స్ కూడా సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. సూరి వెంట రోల్స్ రాయ్స్ కార్లలో సెక్యూరిటి సిబ్బంది కంటికి రెప్పలా కాపాడే విధంగా టామ్ క్రూయిజ్ తీసుకున్న శ్రద్దపై సహచర నటులు కూడా అభినందిస్తున్నారు. 
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా