టామ్ క్రూజ్ కూతురి రహస్య వివాహం!

6 Oct, 2015 20:06 IST|Sakshi
భర్త మాక్స్ పార్కర్ తో ఇసబెల్లా క్రూజ్ (ఇన్ సెట్: నికోల్ కిడ్ మన్, టామ్ క్రూజ్)

లండన్: హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ కూతురు ఇసబెల్లా క్రూజ్.. తన బాయ్ ఫ్రెండ్ ను రహస్యంగా పెళ్లాడారు. ఈ వివాహానికి టామ్ క్రూజ్ సహా అతని మాజీ భార్య నికోల్ కిడ్ మన్ లు హాజరుకాలేదని, అయితే వివారాలు మాత్రం తెలుసుకున్నారని  లండన్ కు చెందిన 'విమెన్స్ డే' మ్యాగజైన్ కథనాన్ని ప్రచురించింది. ఆ వివరాల ప్రకారం..

లండన్ లో హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేస్తోన్న టామ్ కూతురు ఇసబెల్లా (22 ఏళ్లు).. ఏడాదికాలంగా మాక్స్ పార్కర్ అనే ఐటీ కన్సల్టెంట్ తో డేటింగ్ చేస్తోంది. కాగా, ఈ జంట.. నెలరోజుల కిందట వివాహం చేసుకుంది. లండన్ లోని ప్రఖ్యాత డోర్చెస్టర్ స్టార్ హోటల్ లో అతికొద్దిమంది మాత్రమే పాల్గొన్న ఈ కార్యక్రమానికి వధువు తల్లిదండ్రులు  టామ్ క్రూజ్, నికోల్ కిడ్ మన్ లు హాజరుకాలేదు.

అయితే కూతురి వివాహం గురించి టామ్ క్రూజ్ కు ముందే తెలుసని, వేడుక జరిగిన తీరుపై ఆయన ఆరా తీశారని 'విమెన్స్ డే' పేర్కొంది. అటు నికోల్ కిడ్ మన్ కూడా లండన్ లోనే ఉన్నప్పటికీ వివాహానికి హాజరయింది లేనిది తెలియరాలేదు. ఇసబెల్లా సోదరుడు కానర్ కూడా పెళ్లికి వెళ్లలేదు. నిజానికి ఇసబెల్లా టామ్ క్రూజ్ దత్తపుత్రిక. క్రూజ్, నికోల్ కిడ్ మన్ లు భార్యాభర్తలుగా కలిసున్న కాలంలో (1992 నుంచి 2001 వరకు) ఇసబెల్లాను దత్తత తీసుకున్నారు. ఈమెకాకుండా క్రూజ్ కు మరో ఇద్దరు పిల్లలున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి