హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ 

18 Mar, 2020 06:03 IST|Sakshi

స్టార్‌ కపుల్‌ టామ్‌ హ్యాంక్స్, రీటా విల్సన్‌ హాస్పిటల్‌కి టాటా చెప్పి ఇంటికి చేరుకున్నారు. ఓ సినిమా షూటింగ్‌ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు జ్వరం, అలసట అనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు టామ్, రీటా. కరోనా అని నిర్ధారణ కావడంతో ఆస్ట్రేలియాలోనే ఓ హాస్పిటల్‌లో చేరారు. ఐదు రోజులు చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయ్యారు. వీళ్లు కాలిఫోర్నియాలో ఉంటారు. కానీ ఇప్పుడు ప్రయాణం మంచిది కాదని భావించి, హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయిన అనంతరం ఆస్ట్రేలియాలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని, అక్కడ ఉండాలనుకున్నారు. కొన్నాళ్ల పాటు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని ఈ దంపతులు నిర్ణయించుకున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు