బాక్సాఫీస్‌ రైడర్‌

26 Mar, 2018 01:22 IST|Sakshi
ఎలీసియా వికాండర్‌

హాలీవుడ్‌ స్పైస్‌

‘బ్లాక్‌పాంథర్‌’ జోరు మెల్లిగా తగ్గింది. వచ్చే నెల విడుదలయ్యే ‘అవెంజర్స్‌’కు ఇప్పట్నుంచే హంగామా మొదలైంది. ఇక ఈ మధ్యన కూడా కొన్ని సినిమాలు వస్తున్నా ఈ రెండు పెద్ద సినిమాల స్థాయి మాత్రం ఇంకో సినిమాకు లేదు. అయినప్పటికీ గత శుక్రవారం విడుదలైన ‘టూంబ్‌ రైడర్‌’ బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

ఎలీసియా వికాండర్‌ మెయిన్‌ లీడ్‌ చేసిన ఈ సినిమా ఆద్యంతం యాక్షన్‌ అడ్వెంచర్‌ ఎపిసోడ్స్‌తో అభిమానులను మెప్పిస్తోంది. ముఖ్యంగా ఎలీసియా యాక్టింగ్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అమెరికాలో ఈ వారం టాప్‌ ప్లేస్‌లో టూంబ్‌ రైడరే ఉంది. ఇక ఇండియాలోనూ ఈ సినిమాకు మొదట్నుంచీ మంచి ప్రమోషన్స్‌ చేయడంతో ఓపెనింగ్స్‌ బాగున్నాయి. రోర్‌ ఉతౌగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు.. అదే పేరుతో వచ్చి, పాపులర్‌ అయిన వీడియో గేమ్‌ ప్రేరణ.
 

మరిన్ని వార్తలు