కొత్త ఆలోచ‌న‌ల‌కు చిరునామా ‘తూనీగ’

29 Jul, 2019 13:52 IST|Sakshi

తూనీగ.. ఒక దైవ ర‌హ‌స్యం పేరిట వ‌ర్థ‌మాన ద‌ర్శ‌కులు ప్రేమ్ సుప్రీం రూపొందిన ప్ర‌యోగాత్మ‌క చిత్రం. భారీ చిత్రాల‌ను స్ఫురింపజేసేలా అత్యున్న‌త సాంకేతిక అంశాల‌తో రూపొందిన ఓ పురాణేతిహాస ప్ర‌ధాన చిత్రం. భార‌తీయ పురాస్మృతిలో అత్యంత ఆస‌క్తిదాయ‌క క‌థావస్తువుతో రూపొందిన ఈ చిత్ర పోస్ట‌ర్ ను ప్ర‌ముఖ క‌వి, ర‌చ‌యిత, ద‌ర్శ‌కులు త‌నికెళ్ల భ‌ర‌ణి ఆవిష్క‌రించారు. హైదరాబాద్‌లో ఆయ‌న స్వ‌గృహం వ‌ద్ద ఈ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసి, చిత్ర రూప‌క‌ర్త‌నూ, ఇత‌ర బృందాన్నీ అభినందించారు. తాత్విక చింత‌న నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.

దేవ‌ర‌హ‌స్యం వెల్ల‌డించే క్ర‌మంలో ఉత్కంఠ‌త‌ను పెంపొందించే క‌థాంశాన్ని తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రంపై అంచ‌నాలు పెంచేలా పోస్ట‌ర్‌ను డిజైన్ చేసిన తీరు బాగుంద‌ని అభినందించారు. భార‌తీయ సంస్కృతిలో అనేకానేక తాత్విక ప‌ర అంశాల‌కు చ‌ర్చ‌కురాద‌గ్గ అర్హ‌త ఉంద‌ని, ఆ కోవ‌లోనే ఓ ఆస‌క్తిక‌ర అంశాన్ని తీసుకుని ఈ తూనీగ చిత్రం రూపొందింద‌ని, విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప‌రంగా కూడా ఉన్న‌త సాంకేతిక విలువ‌లను పాటించార‌ని వెల్ల‌డించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి స్ఫూర్తితో ఆయ‌న‌కో గురుద‌క్షిణ అన్న రీతిలో తెర‌కెక్కిన ఈ చిత్రం కొత్త ఆలోచ‌న‌ల‌కు చిరునామా నిలుస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కుందని అన్నారు.

ద‌ర్శ‌కులు ప్రేమ్ సుప్రీం మాట్లాడుతూ.. శ్రీ‌కాకుళం త‌న స్వ‌స్థ‌లం అని, ఇప్ప‌టికే  అనేకానేక ల‌ఘు చిత్రాలు రూపొందించాన‌ని, తొలిసారి పూర్తి నిడివి ఉన్న చిత్రాన్ని రూపొందించడం ఆనందంగా ఉంద‌ని అన్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ప్రేమ్ పెయింటింగ్స్ ప‌తాకంపై ఈ ప్ర‌యోగాత్మ‌క ప్రాజెక్టు చేపట్టామ‌ని, ఈ చిత్రానికి సంగీతం సిద్ధార్థ్ స‌దాశివుని, ఛాయాగ్ర‌హ‌ణం రిషి ఎదిగ అందించారని, ప‌బ్లిసిటీ డిజైన‌ర్ గా ఎంకేఎస్ మ‌నోజ్ వ్యవ‌హరించార‌ని వెల్ల‌డించారు.ఆగ‌స్టు మొద‌టివారంలో ఆడియో విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి పాట సాహిత్యాన్ని బాలాజీ, విశ్వ‌ప్ర‌గ‌డ, కిట్టు త‌దిత‌రులు అందించారన్నారు.

వినీత్, దేవయానీ శ‌ర్మ హీరో, హీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతున్న ఈ ప్ర‌యోగాత్మ‌క చిత్రాన్ని అతి త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్నామ‌ని తెలిపారు. ప‌ద్మ దేవీప్ర‌భ సమ‌ర్ప‌ణ‌లో రూపొందిన ఈ చిత్రానికి శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన ప‌లువురు స‌హ నిర్మాతలుగా వ్య‌వ హ‌రించార‌ని పేర్కొన్నారు. విశాఖ‌ప‌ట్నం, హైద్రాబాద్, బెంగ‌ళూరు న‌గ‌రాల‌తో స‌హా శ్రీ‌కాకుళం జిల్లాలో సీతంపేట మ‌న్యం ప‌రిస‌ర ప్రాంతాల‌లో చిత్రీకర‌ణ సాగిందన్నారు. పోస్ట‌ర్ విడుద‌ల వేడుక‌లో హీరో వినీత్, సినిమాటోగ్ర‌ఫ‌ర్ రిషి ఎదిగ‌, ప‌బ్లిసిటీ డిజైన‌ర్ ఎంకేఎస్ మ‌నోజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘బిగ్‌బాస్‌’పై హేమ సంచలన వ్యాఖ్యలు

నా జాక్‌పాట్‌ సూర్యనే!

‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’

నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై 

ముహూర్తం కుదిరిందా?

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా

హేమ అవుట్‌.. తమన్నా ఇన్‌

మహిళా అభిమానిని ఓదార్చిన విజయ్‌

జూనియర్‌ నాని తెగ అల్లరి చేస్తున్నాడట

సంపూ డైలాగ్‌.. వరల్డ్‌ రికార్డ్‌

బిగ్‌బాస్‌.. అందుకే హిమజ సేఫ్‌!

బిగ్‌బాస్‌.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా తమన్నా?

నిఖిల్‌ క్లారిటీ.. సాహో తరువాతే రిలీజ్‌!

ఆడియెన్స్‌ చప్పట్లు కొట్టడం బాధాకరం: చిన్మయి

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు షాక్‌!

బన్నీపై దుష్ప్రచారం : స్పందించిన మెగా టీం

విజయ్‌ దేవరకొండ సినిమా ఆగిపోయిందా?

హీరోకు టైమ్‌ ఫిక్స్‌

నికీషా లక్ష్యం ఏంటో తెలుసా?

ఓ బేబీ షాకిచ్చింది!

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

హీరో సూరి

డూప్‌ లేకుండానే...

తొలి అడుగు పూర్తి

నా కామ్రేడ్స్‌ అందరికీ థ్యాంక్స్‌

హాసన్‌ని కాదు శ్రుతీని!

షుగర్‌ కోసం సాహసాలు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త ఆలోచ‌న‌ల‌కు చిరునామా ‘తూనీగ’

‘బిగ్‌బాస్‌’పై హేమ సంచలన వ్యాఖ్యలు

నా జాక్‌పాట్‌ సూర్యనే!

‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’

నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక

ఆ ముద్ర  చెరిగిపోయింది