రాజమౌళికి కొత్త అభిమానిని : నైజీరియా దర్శకురాలు

20 Jan, 2018 11:04 IST|Sakshi

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి. ఈ సినిమా ప్రపంచ దేశాల్లో భారీ వసూళ్లు సాధించటంతో పాటు భారతీయ సినిమా స్థాయిని ఎన్నో రెట్లు పెంచింది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శితమైన ఈసినిమాపై అంతర్జాతీయ స్థాయి సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో టాప్ డైరెక్టర్‌ చేశారు. నైజీరియాకు చెందిన మహిళా దర్శకురాలు టోపె ఓషిన్‌ ఇటీవల బాహుబలి సినిమాను చూసి సినిమాపై తన సోషల్ మీడియా ద్వారా స‍్పందించారు.

బాహుబలి సినిమా రెండు భాగాలను మార్చి మార్చి చూసినట్టుగా వెల్లడించినా ఓషిన్‌, ఎలా స్పందించాలో అర్థం కావటం లేదని ట్వీట్ చేశారు. ఈ సినిమా ఓ మాస్టర్‌ పీస్‌. సినిమా చూస్తున్నప్పుడు నాకు బాధ, ఆశ్చర్యం, ఆనందం, ఉద్వేగం కలిగాయి.నా మీద బాహుబలి ఎఫెక్ట్‌ కనిపిస్తోంది. బాహుబలి సినిమా కోసం ఎంత సమయమైనా కేటాయించ వచ్చు అందుకే స్క్రిప్ట్‌, ఎడిటింగ్‌ లాంటి చాలా పనులున్నా పక్కన పెట్టి సినిమా చూశాను. నేను మళ్లీ బాహుబలి గురించి ట్వీట్‌ చేయకుండా ఉండగలనేమో చూస్తాను. అంటూ ట్వీట్ చేశారు. త్వరలోనే రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాను కూడా చూస్తానని వెల్లడించారు ఓషిన్‌.

మరిన్ని వార్తలు