వర్షం..రైలు..ఓ గొడుగు-వైరల్‌ వీడియో

12 Aug, 2017 16:01 IST|Sakshi
వర్షం..రైలు..ఓ గొడుగు-వైరల్‌ వీడియో

జార్ఖండ్: ఒకవైపు  బుల్లెట్‌  రైళ్లు,ఎలక్ట్రిక్‌ కార్లు అంటూ  దేశం శరవేరంగా పరుగులుపెడుతున్న వైనం. మరోవైపు రైలు డ్రైవర్ వర్షంలో గొడుగు పట్టుకుని మరీ రైలు బండిని నడుపుత్ను షాకింగ్‌ సన్నివేశం. రైలు నడపడంలో కీలకమైన కం‍ట్రోల్‌ ప్యానెల్‌ తడవకుండా గొడుగు పట్టుకుని,  రైలును నడుపుతున్నఈ వీడియో ఒకటి ఇపుడు వైరల్‌గా మారింది. 

కొన్ని సంవత్సరాలుగా ఇదే దుర‍్భర పరిస్థితి కొనసాగుతోందంటూ ఈ వీడియోను రికార్డు చేసిన వ్యక్తి వాపోయారు. అంతేకాదు నేలమీద కూడా వర‍్షపు నీటిని రక్షించుకునేందుకు నేలమీద పరచిని న్యూస్‌ పేపర్లు.. ఇంకా మరిన్ని కష్టాలు ఈ వీడియోలు మనం   చూడొచ్చు.  కనీసం ఈ వీడియో  చూసిన తరువాత అయినా  పై అధికారుల్లో చలనం వస్తుందనీ, తద్వారా పరిస్థితిలో మార్పు వస్తుందని ఆయన ఆశించారు.  మరి ఫలితం ఉండబోతోందో.. వేచి చూడాల్సిందే..

మరోవైపు ఈ వీడియో ట్విట్టర్‌ లో దుమారం రేపుతోంది. పలు విమర్శలు,  వ్యంగ్యాస్త్రాలతో కూడిన కమెంట్లు వెల్లువెత్తాయి. రైల్వే భద్రతపై ఆందోళన వ్యక‍్తమవుతోంది. అలాగే కేంద్ర రైల్వేశాఖ మంత్రిత్వ శాఖ,  మంత్రి సురేష్‌ ప్రభు ఈ అంశంపై సత్వరమే స్పందించాలని  కోరారు