ముక్కోణపు ప్రేమకథ

1 Oct, 2013 02:07 IST|Sakshi
ముక్కోణపు ప్రేమకథ
‘చంటిగాడు’ సుహాసిని, సుమన్‌శెట్టి ప్రధాన పాత్రల్లో రూపొందిన తమిళ చిత్రం ‘ఉన్నే ఎనక్కు పుడిచ్చిరుక్కు’ ఈ చిత్రాన్ని ‘అమ్మాయి ప్రేమలో పడితే’ పేరుతో సనప జగన్నాథం తెలుగులోకి విడుదల చేస్తున్నారు. ఇటీవలే అనువాద కార్యక్రమాలు మొదలయ్యాయి, ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఓ వైద్య విద్యార్థిని, ఇద్దరు యువకుల చుట్టూ తిరిగే కథ ఇది, ముక్కోణపు ప్రేమకథా చిత్రం.  
 
 ఆకర్షణే ప్రేమగా భావించే యువత ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటున్నారు? ప్రేమలో విఫలమైనవారు దురలవాట్లకు బానిసలుగా మారి జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారు? అనేది ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తం. 
 
 తమిళంలో ఘనవిజయం సాధించినట్లే తెలుగు ప్రేక్షకుల ఆదరణ కూడా పొందుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: అచ్యుత్, సంగీతం: శిర్పి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అన్బు శరవణన్.