అక్కాచెల్లెళ్ల సాహసం

15 Feb, 2019 03:47 IST|Sakshi
త్రిష , సిమ్రాన్

సిమ్రాన్, త్రిష అక్కాచెల్లెళ్లు. అవునా? అని ఆశ్చర్యపడుతున్నారా! నిజంగా కాదు.. ఓ సినిమాలో ఈ ఇద్దరూ అక్కాచెల్లెళ్లుగా నటించనున్నారు. సుమంత్‌ రాధాకృష్ణన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ‘‘ఈ సినిమా స్క్రిప్ట్‌ను ముందు సిమ్రాన్‌కు చెప్పాను. నచ్చడంతో ఆమె అంగీకరించారు. ఆ తర్వాత త్రిషకు చెబితే, ఆమె కూడా ఎగై్జట్‌ అయ్యారు. ఇది అడ్వంచరస్‌ మూవీ. ముఖ్యంగా నీటిలోపల చేసే స్పెషల్‌ యాక్షన్‌ సీన్స్‌ హైలైట్‌గా ఉంటాయి. ఇందుకోసం విదేశీ నిపుణులతో సిమ్రాన్, త్రిష ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారు. ఈ సాహసం చేయడానికి ఇద్దరూ ఆసక్తిగా ఉన్నారు.

మార్చి మొదటివారంలో చిత్రీకరణను మొదలు పెట్టనున్నాం. కొడైకెనాల్, కేరళ, పిచ్చావరమ్‌ దేశీ లొకేషన్లతో పాటు థాయ్‌ల్యాండ్‌లో కూడా షూటింగ్‌ చేయాలనుకుంటున్నాం’’ అని సుమంత్‌ రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. ఇటీవల రజనీకాంత్‌ హీరోగా వచ్చిన ‘పేట్టా’ సినిమాలో సిమ్రాన్, త్రిష కలిసి నటించారు. కానీ వీరి కాంబినేషన్‌లో ఒక్క సీన్‌ కూడా లేదు. అలాగే 1999లో ప్రశాంత్‌ హీరోగా వచ్చిన ‘జోడి’ సినిమాలో సిమ్రాన్‌ కథానాయికగా నటించారు. ఆ చిత్రంలో త్రిష చాలా చిన్న గెస్ట్‌ రోల్‌ చేశారు. తాజా సినిమాలో ఇద్దరూ ముఖ్య తారలు కాబట్టి కాంబినేషన్‌ సీన్స్‌ చాలా ఉంటాయి. ఇద్దరూ మంచి ఆర్టిస్టులే. పోటీపోటీగా నటిస్తారని ఊహించవచ్చు.

మరిన్ని వార్తలు