ఆమె మళ్లీ లవ్‌లో పడిందట..!

28 May, 2019 09:30 IST|Sakshi

సాక్షి,  చెన్నై: సినిమా కథానాయికలు రియల్‌ లైఫ్‌లో లవ్‌లో పడటంలో విశేషం ఏమీ ఉండదు. అయితే అలా అందరి ప్రేమ సక్సెస్‌ అయిన సందర్భాలు తక్కువే. చాలా మంది ప్రేమలో పరాజయాన్నే చవి చూశారు. విషయానికి వస్తే సంచలన నటి త్రిష గురించి ప్రేమ వదంతులు చాలానే వచ్చాయి. టాలీవుడ్‌ నటుడితో ప్రేమ కలాపాలు అన్న వార్త దక్షిణాదిలో హల్‌చల్‌ చేసింది. అయితే ఆ నటుడు త్రిష తనకు మంచి స్నేహితురాలు మాత్రమే అంటూ టేకిట్‌ ఈజీ ధోరణిలో స్పష్టం చేశారు. కాగా నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌మణియన్‌ను ప్రేమించిన త్రిష ఆయనతో ఏడడుగులు వేయడానికి సిద్ధం అయింది. అందుకు సగం పెళ్లిగా భావించే వివాహ నిశ్చితార్ధం కూడా జరిగింది. ఇక పెళ్లే తరువాయి అనుకున్న తరుణంలో అనూహ్యంగా ఆ పెళ్లి నిశ్చితార్ధంతోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇది జరిగి చాలా కాలమే అయ్యింది. అప్పటినుంచి నటనపైనే దృష్టి సారిస్తున్న త్రిష ఇటీవల 96, పేట చిత్రాల విజయంతో మరోసారి ప్రైమ్‌ టైమ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఎక్కువగా హీరోయిన్‌ సెంట్రిక్‌ కథ చిత్రాల్లోనే నటిస్తోంది.

అయితే తాజాగా.. ఈ చెన్నై చిన్నది మరోసారి ప్రేమలో పడినట్లు టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ అమ్మడు తన అభిమానులతో ట్విటర్‌లో తరచూ ఇంటరాక్ట్‌ అవుతుంటుంది. వారి ప్రశ్నలకు తనదైన శైలిలో బదులిస్తూ వారిని ఖుషీ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా ఇటీవల అభిమానులతో ట్విటర్‌లో చాట్‌ చేసింది. పలువురు అభిమానుల ప్రశ్నలకు జవాబులిచ్చింది. అందులో ఒక అభిమాని మీ రిలేషన్‌ షిప్‌ స్టేటస్, మ్యారేజ్‌ గురించి చెప్పమని కోరాడు. అందుకు త్రిష బదులిస్తూ సింగిల్‌ బట్‌ టేకెన్‌ అని సింపుల్‌గా బదులిచ్చింది. అంతే కాదు డూ ఇట్‌ వెన్‌ ఇట్స్‌ ఏ వాంట్‌ అండ్‌ నాట్‌ ఏ నీడ్‌ అని కూడా చెప్పింది. దీంతో ఈ సంచలన నటి మరోసారి లవ్‌లో పడిందనే టాక్‌ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. అయితే ఆ తాజా లవర్‌ ఎవరన్నది ఆరా తీసే పనిలో మీడియా పడింది. ప్రస్తుతం త్రిష రాంగీ చిత్ర షూటింగ్‌లో నటిస్తోంది.

మరిన్ని వార్తలు