సూపర్‌ లేడీ

11 Apr, 2019 05:47 IST|Sakshi

త్రిషను ఇప్పుడు చాలామంది సూపర్‌ లేడీ అంటున్నారు. ఎందుకంటే ఆమె చేతిలో ఉన్నవన్నీ దాదాపు ‘లేడీ ఓరియంటెడ్‌’ సినిమాలే. మామూలుగా కథానాయిక ప్రాధాన్యం ఉన్న కథలంటే అందులో నటించే నాయికకు థియేటర్స్‌కి జనాలను రాబట్టగలిగే సత్తా ఉండాలి. అప్పుడే హీరోయిన్‌గా తీసుకుంటారు. త్రిష సూపర్‌ అని ఆమెను లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు తీసుకుంటున్నారు కోలీవుడ్‌ దర్శక–నిర్మాతలు. ఇటీవలే  ‘పరమ పదమ్‌ విళయాట్టు’ అనే లేడీ ఓరియంటెడ్‌ సినిమాని పూర్తి చేశారామె. ఇది రిలీజ్‌కు రెడీ అవుతోంది. అలాగే మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీ చిత్రీకరణ జరుగుతోంది.

సుమం  రాధాకృష్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిమ్రాన్‌ మరో నాయికగా నటిస్తున్నారు. తాజాగా మరో కథానాయికగా ప్రాధాన్యం ఉన్న చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు త్రిష. ‘ఎంగేయుమ్‌ ఎప్పోద్దుమ్‌’ (తెలుగులో ‘జర్నీ’) ఫేమ్‌ ఎమ్‌. శర్వణన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. అలాగే హిందీ హిట్‌ ‘బద్లా’ తమిళ రీమేక్‌లో త్రిష నటిస్తారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు త్రిష నటించిన చతురంగవేటై్ట 2, 1818 రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ విధంగా వరుస లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు సైన్‌ చేస్తూ త్రిష సూపర్‌ లేడీ అనిపించుకున్నారు. అంతేగా మరి... ఇండస్ట్రీకి వచ్చి 15ఏళ్లు దాటినప్పటికీ ఇన్ని సినిమాలు చేతిలో ఉండటం అంటే సూపరే మరి.

మరిన్ని వార్తలు