సామి 2 నుంచి త్రిష ఔట్‌

24 Oct, 2017 10:49 IST|Sakshi

సామి2 చిత్ర యూనిట్‌ ఆదిలోనే షాక్‌కు గురైంది. నటుడు విక్రమ్‌కు కమర్షియల్‌ హీరో ఇమేజ్‌ను ఆపాధించిన చిత్రం సామి. యాక్షన్ కథా చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన హరి దర్శకత్వం వహించిన ఈ చిత్ర విజయంలో కథానాయకి త్రిషకు భాగం ఉంటుంది. ఆమె అందాలు సామి చిత్రానికి ఆకర్షణగా నిలిచాయి. ఇక విషయానికి వస్తే సామి చిత్రానికి సీక్వెల్‌ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.

విక్రమ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి హరినే దర్శకుడు. హీరోయిన్ కూడా త్రిషనే. అయితే అధనంగా కీర్తీసురేశ్‌ వచ్చి చేరింది. శిబుతవీన్ భారీ ఎత్తున్న నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీత బాణీలు కడుతున్నారు. చిత్ర యూనిట్‌ ఇటీవలే ఢిల్లీలో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించుకుని తొలి షెడ్యూల్‌ పూర్తి చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో సామి 2 చిత్రం నుంచి వైదొలగుతున్నట్లు నటి త్రిష సోమవారం తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బేధాభిప్రాయం కారణంగా తాను చిత్రం నుంచి తప్పుకున్నానని, చిత్ర యూనిట్‌కు బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ అంటూ త్రిష పేర్కొన్నారు. కాగా ఆది నుంచి సామి 2 చిత్రంలో నటి కీర్తీసురేశ్‌కే ప్రాముఖ్యత అని, త్రిష పాత్ర పరిమితంగానే ఉంటుందనే ప్రచారం సాగుతోంది.

తాజా పరిణామాలతో అది నిజమని రుజువయ్యిందనిపిస్తోంది. కాగా త్రిష సామి2 చిత్రం నుంచి వైదొలగడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై చిత్ర వర్గాలు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. మొత్తం మీద ఈ విధంగా త్రిష సామి2 చిత్ర యూనిట్‌కు షాక్‌ ఇచ్చారన్నమాట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా